Suryapet District : విషాదం... క్వారీ గుంతలో పడి అమ్మాయితో పాటు మరో ఇద్దరు మృతి
17 July 2024, 15:26 IST
- Suryapet District News : క్వారీ గుంతలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పరిధిలోని బొప్పారం గ్రామ పరిధిలో జరిగింది.
ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
స Suryapet District News : సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు (ఎస్) మండలం బొప్పారం గ్రామంలోని క్వారీ గుంటను చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో 12 ఏళ్ల అమ్మాయి… ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన తండ్రితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ఏం జరిగిందంటే…?
సూర్యాపేట జిల్లా పరిధిలోని బొప్పారం గ్రామంలో నిన్న ఓ విందు కార్యక్రమం జరిగింది. ఇందుకోసం హైదరాబాద్ లో నివాసం ఉండే శ్రీపాల్ రెడ్డి కుటుంబం గ్రామానికి వచ్చింది. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డితో పాటు ఆయన కుమార్తెతో పాటు రాజు అనే వ్యక్తి కూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీలో జారి పడిపోయింది.
కుమార్తె పడిపోవటంతో వెంటనే ఇద్దరు క్వారీలోకి దిగారు. అయితే వీరికి ఈత రాకపోవటంతో ముగ్గురు నీటిలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్నేహితులైన శ్రీపాల్‌రెడ్డి, రాజు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీరిగా పని చేస్తుండగా… శ్రీపాల్ రెడ్డి బిల్డర్ గా ఉన్నారు. 12 ఏళ్ల కుమార్తెతో పాటు తండ్రి కూడా చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్ లో దారుణం:
హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉబర్ ఆటో డ్రైవర్ల బ్యాచ్ ఓ మహిళను బంధించి కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అల్వాల్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్ధరాత్రి తన భర్తతో గొడవపడి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ ఓ ఉబర్ ఆటోలో వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్, మరో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు. ఆ తర్వాత ఆ మహిళను కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. మహిళలు రాత్రుళ్లు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదంటూ పలువురు అంటున్నారు.