తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Wanaparthy Robbery: వనపర్తి జిల్లా పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీలో పలువురికి తీవ్ర గాయాలు

Wanaparthy Robbery: వనపర్తి జిల్లా పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీలో పలువురికి తీవ్ర గాయాలు

19 December 2024, 8:43 IST

google News
    • Wanaparthy Robbery: వనపర్తి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పుణ్య క్షేత్రాలు దర్శించుకుని స్వస్థలాలకు తిరిగి వెళుతున్న కుటుంబంపై దాడి చేసి దోచుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై వాహనంలో నిద్రిస్తున్న వారిపై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. 
పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీ, ముగ్గురికి తీవ్రగాయాలు (ప్రతీకాత్మక చిత్రం)
పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీ, ముగ్గురికి తీవ్రగాయాలు (ప్రతీకాత్మక చిత్రం)

పెబ్బేరులో జాతీయ రహదారిపై దారిదోపిడీ, ముగ్గురికి తీవ్రగాయాలు (ప్రతీకాత్మక చిత్రం)

Wanaparthy Robbery: వరంగల్‌లో జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న కుటుంబంపై దుండగులు దాడి చేసి దోచుకోవడం కలకలం రేపింది. కారు అద్దాలు పగుల గొట్టి మహిళల మెడలో ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘటన కలకలం సృష్టించింది.

జగి త్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూర్ గ్రామానికి చెందిన రాజేశ్ కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్‌ 13న కారులో తిరు పతి, అరుణాచలం తీర్థ యాత్రలకు వెళ్లారు. ఆలయాల సందర్శన పూర్తైన తర్వాత తిరుగు ప్రయాణంలో బుధ వారం తెల్లవారుజామున 3:30 గంటలకు విశ్రాంతి కోసం పెబ్బేరు జాతీయ రహదారి వెంబడి ఉన్న హైవే పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపి నిద్రపోయారు.

వారు నిద్రలోకి జారుకున్న కొద్ది సేపటికి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి వాహనంలో ఉన్న మహిళల మెడల్లో ఉన్న ఆభరణాలు లాక్కున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు కారులో ఉన్న పురుషులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

వాహనంలో ఉన్న సరస్వతి, జ్యోతి, రజిని, సంతో ష్ మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కోడానికి ప్రయత్నించడంతో బాధితులు ప్రతిఘటించారు. దీంతో దోపిడీ దొంగలు రాళ్లు, కత్తులతో దాడి చేశారు. బాధితుల నుంచి 14 తులాల బంగారు గొలుసులతో పాటు లగేజీ బ్యాగులను కూడా తీసుకుపోయారు.

ఆ తర్వాత బాధితులు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల దాడిలో తీవ్రంగా గాయ పడిన ప్రణీత్, శ్రీశాంత్, సంతోష్‌లను అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. క్లూస్‌ టీమ్‌, జాగిలాలతో దోపిడీకి పాల్పడిన వారి కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

దోపిడీ జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో బాధితుల బ్యాగులు పడి ఉండటాన్ని గుర్తించారు. వాటిలో విలువైన వస్తువులు లేకపోవడంతో అక్కడే వదిలేసినట్టు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

తదుపరి వ్యాసం