తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Smuggling: అంతర్ జిల్లా గంజాయి ముఠాకు చెందిన ముగ్గురు సిరిసిల్లలో అరెస్ట్, 440 గ్రాముల గంజాయి స్వాధీనం

Ganja Smuggling: అంతర్ జిల్లా గంజాయి ముఠాకు చెందిన ముగ్గురు సిరిసిల్లలో అరెస్ట్, 440 గ్రాముల గంజాయి స్వాధీనం

HT Telugu Desk HT Telugu

30 October 2024, 6:01 IST

google News
    • Ganja Smuggling: అంతర్ జిల్లా గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. పట్టుబడ్డ ముగ్గురి నుంచి 440 గ్రాముల గంజాయి, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
క్యాండిల్ ర్యాలీ  నిర్వహిస్తున్న పోలీసులు
క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

Ganja Smuggling: సిరిసిల్ల అంబేద్కర్ నగర్ కు చెందిన సదిమెల అభినయ్(19), రంగారెడ్డి జిల్లా కీసర సమీపంలోని అహ్మద్ గూడకు చెందిన కాంతి సాగర్ గణేశ్(20), మేడ్చల్ జిల్లా సిటిజెన్ కాలనీకి చెందిన మాపు జోయెల్ వంశీ(20) ముగ్గురు ఇంస్టాగ్రామ్ లో పరిచయమై గంజాయికి బానిసయ్యారు. తరుచు గంజాయి తాగుతూ తమకు అవసరం ఉన్నప్పుడల్లా దూల్ పేట వెళ్ళి గంజాయి కొనుక్కొని వచ్చి వారు తాగుతూ గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరకు విక్రయించి జల్సాలు చేసేవారు.

కాంతి సాగర్ గణేష్, వంశీలు కలిసి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి సిరిసిల్లలో ఉన్న అభినయ్ కి గంజాయి అమ్మడానికి రాగ సిరిసిల్ల ఎల్లమ్మ సర్కిల్ వద్ద అభినయ్ కి గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందని డిఎస్పీ తెలిపారు. ముగ్గురిపై గంజాయి అక్రమ రవాణా విక్రయం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ ప్రకటించారు.

గంజాయిపై ఉక్కుపాదం..

అక్రమంగా గంజాయి విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు, గంజాయి కిట్ల తో పరీక్ష లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని డిఎస్పీ చెప్పారు.

యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ స్టేషన్ కు, డయల్ 100 కి సమాచారం అందించాలన్నారు. గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.

పోలీసుల క్యాండిల్ ర్యాలీ…

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎస్పీ అఖిల్ మహజన్ తో పాటు పోలీసులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను ప్రజలు మరువ వద్దని ఎస్పీ కోరారు.

వారి త్యాగాల ఫలితంగానే నేడు ప్రశాంత వాతవరణం నెలకొందన్నారు. ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్మరణ వారోత్సవలు నిర్వహిస్తున్నమని తెలిపారు. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదాన శిబిరం, సైకిల్, బైక్ ర్యాలీ, 2కె రన్, వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఓపెన్ హౌస్ కార్యక్రమలు నిర్వహించామన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం