తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Komatireddy: కాంగ్రెస్‌లో కోమటి రెడ్డి కలకలం..రాజీనామా వార్తలకు ఖండన

Congress Komatireddy: కాంగ్రెస్‌లో కోమటి రెడ్డి కలకలం..రాజీనామా వార్తలకు ఖండన

HT Telugu Desk HT Telugu

06 April 2023, 11:28 IST

google News
    • Congress Komatireddy: కాంగ్రెస్‌ పార్టీలో కోమటిరెడ్డి కలకలం రేగింది. పార్టీకి భువనగిరి ఎంపీ రాజీనామా చేస్తున్నారంటే కథనాలు వెలువడటం రేగింది. పార్టీని వీడేందుకు కోమటిరెడ్డి సిద్ధమయ్యారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తల్ని కోమటిరెడ్డి ఖండించారు. 
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో) (twitter)

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫొటో)

Congress Komatireddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‍రెడ్డి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు గురువారం ఉదయం ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వెంకట్‍రెడ్డి పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడంతో పార్టీని విడిచి పెట్టేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల్ని చేర్చుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి విబేదించారు. చెరుకు సుధాకర్‌ను చేర్చుకున్న సమయంలో బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో సమావేశమై కలకలం రేపారు.

గతంలో పీసీసీ అధ్యక్ష , ఏఐసీసీ పదవులు ఆశించిన వెంకట్‍రెడ్డి ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్ది చెప్పడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అక్రోశం కోమటిరెడ్డిలో ఉంది. తనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో వెంకట్‍రెడ్డి మనస్థాపానికి గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఎంపీ వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ వీడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో దూరం పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఊరడించడంతో వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని అనుచరులు చెబుతున్నారు.

పార్టీ మార్పు వార్తలు దుమారం రేపడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేయాలని అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నానని చెప్పారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు.

తదుపరి వ్యాసం