తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime: భూమి విక్రయాల్లో మోసాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష, జరిమానా

Medak Crime: భూమి విక్రయాల్లో మోసాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష, జరిమానా

HT Telugu Desk HT Telugu

15 November 2023, 13:46 IST

google News
    • Medak Crime: ఒకే భూమిని రెండు సార్లు అమ్మిన వ్యవహారంలో    సంగారెడ్డిలో నలుగురికి ఆరునెలల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించారు. 
ఛీటింగ్ కేసులో జైలు శిక్ష
ఛీటింగ్ కేసులో జైలు శిక్ష

ఛీటింగ్ కేసులో జైలు శిక్ష

Medak Crime: అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో, భూమిని ప్లాట్ లుగా చేసి, అదే భూమిని రెండు సార్లు అమ్మి సొమ్ము చేసుకున్న వ్యవహారంలో సంగారెడ్డి న్యాయమూర్తి నలుగురికి నాలుగు నెలల జైలు శిక్ష విధించారు. పఠాన్ చెరువు మండలంలోని భానూర్ గ్రామం హైదరాబాద్ కు చేరువలో ఉండటంతో, అదే గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన టంగుటూరి నరసింహులు, టంగుటూరి బుచ్చయ్య, టంగుటూరి రాములు, టంగుటూరి కిష్టయ్య గ్రామంలో ఉన్న తమ స్వంత భూమిని ప్లాట్ లుగా మార్చి విక్రయించారు.

నిందితులు భూములను 1985లో, 2005లో రెండుసార్లు వివిధ వ్యక్తులకు అమ్మారు. ఈ విషయంపై ప్లాట్ లు కొన్న కొంతమందికి అనుమానం రావటంతో వారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిని, సంగారెడ్డి పోలీసు వారిని సంప్రదించారు. ప్లాట్ లు అమ్మినప్పుడు, పఠాన్ చెరువు రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంగారెడ్డి లో ఉండటం వలన, ప్లాట్ లు కొన్న హైదరాబాద్ కు చెందిన రంగా రావు, వెంకటేశ్వర్ రావు, జయశ్రీ, సుమిత్ర, తదితరులు పోలీసులను ఆశ్రయించారు.

సంగారెడ్డి పోలీసులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, ఈ భూమిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్మినట్టు గుర్తించడంతో, పూర్వాపరాలు పరిశీలించిన సంగారెడ్డి జిల్లా జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ అదనపు న్యామూర్తి ఎస్. షాలిని తీర్పునిచ్చారు. నలుగురి నిందితులకు ఆరునెలల శిక్ష విధించడం తో పాటు ఒక్కొక్కరికి రూ 4 వేల చొప్పున జరిమానా విధిస్తు మంగళవారం రోజు తన తీర్పును వెలువరించారు.

సైబర్ నేరగాళ్లు ప్రజల్లో ఆశ, భయం అనే రెండు అంశాల మీద ఆధారపడి సైబర్ నేరాలు చేస్తున్నారని, నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ ,పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని.. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్వేత అన్నారు.

వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కాబట్టి ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చన్నారు.

తదుపరి వ్యాసం