TSPSC HWO Hall Ticket 2024 : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ఉద్యోగాల హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్ ఇదే
21 June 2024, 14:00 IST
- TGPSC Hostel Welfare Officer Hall Ticket : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వీటిని TGPSC వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాల్ టికెట్లు విడుదల
TGPSC Hostel Welfare Officer Hall Tickets 2024 : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ఉద్యోగ రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 581 HWO ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా పూర్తి కావటంతో…. తాజా హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
టీజీపీఎస్సీ కమిషన్ https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 29వ తేదీవ తేదీతో పూర్తి కానున్నాయి. కంప్యూటర్ ఆధారిత (CRBT)విధానంలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
2 పేపర్లు 300 మార్కులు..
ఈ ఉద్యోగాల భర్తీ కోసం 2 పేపర్లతో కూడిన పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులు ఉంటాయి. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్) ఉంటాయి. 150 ప్రశ్నలు-150 మార్కులు అంటే ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో మాధ్యమాల్లో ఉంటాయి.
సిలబస్ చూస్తే...
పేపర్ 1 లో చూస్తే కరెంట్ ఎఫైర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎకానీ తెలంగాణ, ఇండియా, జియోగ్రఫీ, భారత రాజ్యాంగం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర విధానాలు, భారత జాతీయ ఉద్యమం, తెలంగాణ ఉద్యమ చరిత్ర వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇక పేపర్ 2 విషయానికి వస్తే... Understanding Disability,Early Identification and Intervention, Anatomy and Physiology of Human Eye,Effects of Blindness and Low Vision,Educational Perspectives: Blindness and Low Vision,Children with Visual Impairment with Additional Disabilities (VIAD),Management of Children with VIAD,Working Braille,Orientation and Mobility & Vision Training,Use of Special Appliances , Aids &Adaptations టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. వేర్వురు ఉద్యోగాలకు వేర్వురు సిలబస్ ఉంటుంది. పూర్తి వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడవచ్చు.
పోస్టుల వివరాలు:
- విభాగం: ట్రైబల్ వెల్ఫేర్.
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్ -2): 106 పోస్టులు
- విభాగం: ట్రైబల్ వెల్ఫేర్.
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు: 70
- విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్.
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్): 228
- విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్.
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2: 140
- విభాగం: బీసీ వెల్ఫేర్.
- వార్డెన్ (గ్రేడ్ -1): 05
- విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
- మ్యాట్రన్ (గ్రేడ్ -1): 03
- విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
- వార్డెన్ (గ్రేడ్-2): 03
- విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
- మ్యాట్రన్ (గ్రేడ్-2): 02
- విభాగం: డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్.
- లేడి సూపరింటెండెంట్: 19
- విభాగం: చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉండాలి. .