TGPSC Group 2 Vs RRB : ఒకే రోజున తెలంగాణ గ్రూప్-2, ఆర్ఆర్బీ పరీక్షలు-ఏ పరీక్ష వాయిదా పడుతుందో?
23 November 2024, 18:00 IST
TGPSC Group 2 Vs RRB : తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు కొత్త చిక్కు ఎదురైంది. గ్రూప్-2 పరీక్ష రోజునే ఆర్ఆర్బీ జేఈ పరీక్ష రావడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండింటిలో ఒక పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు.
ఒకే రోజున తెలంగాణ గ్రూప్-2, ఆర్ఆర్బీ పరీక్షలు-ఏ పరీక్ష వాయిదా పడుతుందో?
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే గ్రూప్-2 సర్వీస్ పరీక్ష తేదీనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష నిర్వహిస్తోంది. ఆర్ఆర్బీ జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 16న పరీక్ష నిర్వహించనున్నారు.అయితే ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో ఏ పరీక్షకు హాజరవ్వాలో అని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-2, ఆర్‌ఆర్‌బీ జేఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు పరీక్షలలో ఒకటి వదులుకోవాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. రెండు పరీక్షల్లో ఏదోకటి వాయిదా వేయాలని రైల్వే శాఖతో పాటు టీజీపీఎస్సీని కోరుతున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్బీలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఆర్ఆర్బీ జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 16, 17, 18వ తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. టీజీపీఎస్సీ సైతం గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. గ్రూప్-2 రెండో పేపర్ డిసెంబర్ 16న ఉండగా అదే రోజు ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో ఒకటి నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు రావడంతో... ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక దానిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
డిసెంబర్ 9న హాల్ టికెట్లు
టీజీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల భర్తీకి వచ్చే నెల 15,16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. గ్రూప్-2 పరీక్షలకు డిసెంబర్ 9న హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. గ్రూప్-2 పరీక్ష పూర్తి టైమ్ టేబుల్, సూచనలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది.
గ్రూప్-2 పేపర్-1 ను డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు. డిసెంబరు 16వ తేదీ పేపర్3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు హాల్టికెట్లు డౌన్లోడ్ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదించాలని టీజీపీఎస్సీ తెలిపింది. లేదా Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్ సందేహాలు పంపవచ్చని పేర్కొంది.
'గ్రూప్-2' టైంటేబుల్..
- పేపర్-1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ డిసెంబరు 15, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30
- పేపర్-2: హిస్టరీ, పాలిటీ, సొసైటీ
- డిసెంబరు 15, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30
- పేపర్-3: ఎకానమీ, డెవలప్మెంట్ పేపర్లు
- డిసెంబరు 16, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30
- పేపర్-4: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు డిసెంబరు 16, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.
అభ్యర్థులకు ఎట్టిపరిస్థితుల్లో డూప్లికేట్ హాల్ టికెట్ తరువాత జారీ చేయరని కమిషన్ స్పష్టం చేసింది. ఏదైనా సాంకేతిక సమస్యల విషయంలో, అభ్యర్థి TGPSC సాంకేతిక సహాయాన్ని సంప్రదించవచ్చు