తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Shirdi Tour : 2 రోజుల 'షిర్డీ' ట్రిప్ - బాబా థీమ్ పార్క్ షో కూడా చూడొచ్చు, ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వివరాలివే

Hyderabad Shirdi Tour : 2 రోజుల 'షిర్డీ' ట్రిప్ - బాబా థీమ్ పార్క్ షో కూడా చూడొచ్చు, ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వివరాలివే

19 April 2024, 17:12 IST

    • Hyderabad Shirdi Tour 2024: హైదరాబాద్ నుంచి షిర్డీకి ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. రెండు రోజుల్లోనే ఈ టూర్ ముగుస్తుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ

Telangana Tourism Shirdi Tour 2024: షిర్డీకి(Shirdi) వెళ్లే ప్లాన్ ఉందా…? ఎలాంటి ఇబ్బంది లేకుండా, తొందరగా వెళ్లి రావాలనుకునే వారికోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism S). హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 2 రోజుల్లోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….

ట్రెండింగ్ వార్తలు

Mulugu District : లిఫ్ట్ ఇచ్చి రేప్..! అడవిలో అంగ‌న్వాడీ టీచ‌ర్ హత్య

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వివరాలు:

  • షిర్డీకి వెళ్లేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. 
  • Shiridi - Flight Package - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది.
  • హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ఫ్లైట్  శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మధ్యాహ్నం 01. 30 pmకు బయల్దేరుతుంది.
  • 2:50 pmకు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3:30pmకి హోటల్ లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది.
  • 7:00PM-7:30PM మధ్య THEME PARK (BABA SOUND &LIGHT SHOW) షో ఉంటుంది.
  • రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు.
  • రాత్రి 9 తర్వాత హోటల్ కు చేరుకుంటారు.
  • DAY2: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత పంచముఖి గణపతి టెంపుల్ కు వెళ్తారు. ఓల్డ్ షిర్డీని చూస్తారు. kandoba మందిర్ కు వెళ్లటంతో పాటు SAI TEETH ను సందర్శిస్తారు.
  • మధ్యాహ్నం 12.30pmకు చేరుకుంటారు. సాయంత్రం 5:30PMకు హైదరాబాద్ కు ఫ్లైట్ లో చేరుకుంటారు.
  • ఈ ప్యాకేజీ ధర రూ. 12499గా ఉంది.
  • ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.
  • ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ ప్రాసెస్ కూడా పూర్తి చేయవచ్చు.

తదుపరి వ్యాసం