Somasila Tour Package : 2 రోజుల 'సోమశిల' ట్రిప్ - శ్రీశైలం నుంచి బోట్ జర్నీ, ప్యాకేజీ వివరాలివే
Telangana Tourism Somasila Tour Package 2024 : తక్కువ ధరలోనే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తోంది తెలంగాణ టూరిజం. హైదరాబాద్ నుంచ వీటిని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీశైలం - సోమశిల ట్రిప్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Telangana Tourism Somasila Tour Package 2024 : సోమశిల ప్రకృతి అందాలను చూసి అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). Srisailam - Somasila Road cum River Cruise Tour పేరుతో ఆ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.
సోమశిల టూరిజం ప్యాకేజీ వివరాలు:
- హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
- ప్రతి శనివారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
- రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
- నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.
- శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.
- ఇక రెండో రోజు శ్రీశైలం నుంచి బయల్దేరి.. సోమశిల చేరుకుంటారు. ఇక్కడ క్రూజ్ బోట్ ద్వారా జర్నీ ఉంటుంది. బోట్ లో మీల్స్ ఇస్తారు.
- సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
- రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.
సోమశిల టూర్ ప్యాకేజీ ధరలు….
Srisailam Somasila Tour Package Prices 2024: హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3600గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
IRCTC Hyderabad Srisailam Tour Package 2024 : మరోవైపు బడ్జెట్ ధరలోనే మంచి టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఒకే ప్యాకేజీలు పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేలా ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ''SPIRITUAL TELANGANA WITH SRISAILAM' పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని (IRCTC Srisailam Tour)తీసుకొచ్చింది. రోడ్డు మార్గానే జర్నీ ఉంటుంది.ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా…మీరు' శ్రీశైలాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా…. హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ ను సందర్శించారు. ఫైనల్ గా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో టూర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 03, 2024వ తేదీన అందుబాటులో ఉంది. మొత్తం 4 రోజుల ప్యాకేజీ ఇది.
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ టూరిజం ప్యాకేజీ(IRCTC Hyderabad Srisailam Tour2024) ధరలను చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. ₹37200గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19530, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14880గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఈ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే… https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భోజన వసతితో పాటు మరికొన్ని సదుపాయాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.