Kinnerasani wildlife sanctuary : ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్ కిన్నెరసాని-ఒకసారి చూసొద్దామా?-warangal news in telugu kinnerasani wildlife sanctuary tourist spot how to reach travel guide ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kinnerasani Wildlife Sanctuary : ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్ కిన్నెరసాని-ఒకసారి చూసొద్దామా?

Kinnerasani wildlife sanctuary : ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్ కిన్నెరసాని-ఒకసారి చూసొద్దామా?

Feb 27, 2024, 05:42 PM IST HT Telugu Desk
Feb 27, 2024, 05:42 PM , IST

  • Kinnerasani wildlife sanctuary : అక్కడి ప్రకృతి రమణీయత మనసును ఓలలాడిస్తుంది. హొయలొలుకుతూ సాగే నీటి ప్రవాహం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అబ్బురపరిచేలా కనిపించే వన్య ప్రాణుల సందడికి అది కేరాఫ్ అడ్రెస్. ఆ సుందర ప్రాంతమే కిన్నెరసాని ప్రాజెక్ట్.

అక్కడి ప్రకృతి రమణీయత మనసును ఓలలాడిస్తుంది. హొయలొలుకుతూ సాగే నీటి ప్రవాహం అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అబ్బురపరిచేలా కనిపించే వన్య ప్రాణుల సందడికి అది కేరాఫ్ అడ్రెస్. ఆ సుందర ప్రాంతమే కిన్నెరసాని ప్రాజెక్ట్. అందుకే సెలవు దొరికితే చాలు.. సేద తీరడానికి వలస వచ్చే పక్షుల్లా ఈ ప్రాజెక్టు దగ్గరికి జనం తండోపతండాలుగా వచ్చేస్తారు. 

(1 / 5)

ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు అడవుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల మీదుగా పాల్వంచ మండలంలో పచ్చని ప్రకృతి మధ్య సేద తీరిందే కిన్నెరసాని. కిన్నెరసాని హొయలను వర్ణిస్తూ "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి" అంటూ ఓ సినీ కవి మస్తిష్కం నుంచి జాలువారిన పాట తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిర స్థాయిగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 

(2 / 5)

కిన్నెరసాని ప్రాజెక్ట్ భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నుంచి దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాల్వంచ పట్టణం నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ప్రాజెక్ట్ నీటి అవసరాల కోసం కిన్నెరసాని ప్రాజెక్టును 1972వ సంవత్సరంలో నిర్మించారు. కిన్నెరసానిలోకి 516 స్క్వేర్ మైల్స్ నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ లో 10 స్క్వేర్ మైల్స్ లో నీటి నిల్వ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎత్తు దాదాపు 415 అడుగులు కాగా లోపల 407 అడుగుల్లో 1.45టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. వానా కాలంలో 12 గేట్ల నుంచి వరద నీటిని వదిలినప్పుడు ఆ దృశ్యాన్ని చూసేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు. 

(3 / 5)

 కిన్నెరసాని ప్రాజెక్ట్ నడి బొడ్డున ఉన్న ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడింది ఆ ప్రాంతం. కొన్ని కాటేజీలను దట్టమైన చెట్ల మధ్య నిర్మించారు. ఈ మధ్య బోటు మీద ఆ ప్రాంతానికి వెళ్లి పిక్నిక్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ బోటు షికారుకు బాగుంటుంది. ఈ ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇదివరకు కొన్ని సినిమా షూటింగ్ లు కూడా జరిగాయి. మొత్తంమీద ఎంతో సుందరంగా, అందాలొలికే ఈ కిన్నెరసాని ప్రాజెక్టును తప్పనిసరిగా చూడాల్సిందే. (రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)

(4 / 5)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు