తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Tourism : హైదరాబాద్ సిటీని చుట్టేద్దాం..! రూ.380కే టూర్ ప్యాకేజీ - ఈ 9 టూరిస్ట్‌ స్పాట్స్‌ చూడొచ్చు!

Telangana Tourism : హైదరాబాద్ సిటీని చుట్టేద్దాం..! రూ.380కే టూర్ ప్యాకేజీ - ఈ 9 టూరిస్ట్‌ స్పాట్స్‌ చూడొచ్చు!

22 September 2024, 12:35 IST

google News
    • Hyderabad City Tour Package : హైదరాబాద్ నగరాన్ని చుట్టేయాలనుకుంటున్నారా..? అయితే ఫేమస్ టూరిస్ట్ ప్లేసులను చూసేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. కేవలం రూ. 380కే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. వన్ డేలోనే పూర్తి అవుతుంది. టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను బుకించ్ చేసుకోవచ్చు.
'హైదరాబాద్' సిటీ ట్రిప్ ప్యాకేజీ - 2024
'హైదరాబాద్' సిటీ ట్రిప్ ప్యాకేజీ - 2024 (images from unsplash.com)

'హైదరాబాద్' సిటీ ట్రిప్ ప్యాకేజీ - 2024

తెలంగాణ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకువస్తుంది. కేవలం రాష్ట్రం పరిధిలోనే కాకుండా… మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలను చూపించేందుకు ఆపరేట్ చేస్తోంది. వీటిని తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా కొత్త ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది.

HYDERABAD CITY TOUR పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి ఈ ప్యాకేజీ వివరాలను చెక్ చేసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.  ప్రతి రోజు ఆపరేట్ చేస్తారు. మీకు అనుగుణంగా తేదీలను ఎంచుకోని బుకింగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తారు. 

చూపించే ప్రాంతాలు:

సిటీ ట్రిప్ ప్యాకేజీ కేవలం వన్ డే లోనే ముగుస్తుంది. ఇందులో భాగంగా బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్‌ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ ను చూస్తారు.

హైదరాబాద్ లోని హియామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ అనుమతిస్తారు.అన్ని మ్యూజియంలు శుక్రవారం మూసివేస్తారు. ఇందుకు బదులుగా శుక్రవారం నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. మీరు వెళ్లే రోజును బట్టి ఈ విషయంలో ఓ అంచనాకు రావొచ్చు.

ధరల వివరాలు :

హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజీ ధరలు : నాన్ ఏసీలో పెద్ద వారికి రూ.  రూ.380గా నిర్ణయించారు. చిన్నారులకు రూ.300గా ఉంది. ఏసీ జర్నీలో అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400గా ఉంది.

  • ఈ ప్యాకేజీని  బుకింగ్ చేసుకోవాలంటే… ఉదయం 7.30 AM - రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్, ఫోన్: 9848126947ను సంప్రదించవచ్చు. ఇదే కాకుండా ఉదయం 07:45  గంటలకు- రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్- ఫోన్: 8367285285కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.
  • ఇక ఉదయం 8. 15 గంటలకు అయితే … CRO బషీర్‌బాగ్, గ్రౌండ్ ఫ్లోర్ శకర్ భవన్, ఎదురుగా. సీసీఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్, టాటా మోటార్స్ పక్కన, బషీర్‌బాగ్, హైదరాబాద్- ఫోన్ నెంబర్ 9848540371ను సంప్రదించవచ్చు.  మీరే వెళ్లే ప్రదేశాల వద్ద ఎంట్రీ టికెట్ తో పాటు భోజన ఖర్చులను సొంతంగానే భరించాల్సి ఉంటుంది.
  • ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్: https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=1&serviceCode=18&journeyDate=2024-09-22&adults=2&childs=0 

తదుపరి వ్యాసం