తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Polycet 2024: తెలంగాణ పాలీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

TS Polycet 2024: తెలంగాణ పాలీసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

Sarath chandra.B HT Telugu

15 February 2024, 6:39 IST

google News
    • TS Polycet 2024: తెలంగాణ పాలిటెక్నిక్ 2024 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 
తెలంగాణ పాలీసెట్‌ 2024 నోటిఫికేషన్
తెలంగాణ పాలీసెట్‌ 2024 నోటిఫికేషన్

తెలంగాణ పాలీసెట్‌ 2024 నోటిఫికేషన్

TS Polycet 2024: పదో తరగతి విద్యార్హతతతో సాంకేతిక విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే పాలిటెక్నిక్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ నోటిఫికేషన్‌ విడుదలైంది.

తెలంగాణ పాలిటెక్నిక్ 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

తెలంగాణ పాలీసెట్‌ 2024 ద్వారా పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ 2024 నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. పాలీసెట్ 2024 Polycet 2024 ద్వారా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కల్పిస్తారు. పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రశేశ పరీక్ష - పాలీసెట్‌ 2024 ద్వారా విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్‌ Common Entrance టెస్ట్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ TSBSE గుర్తింపు పొందిన ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులు, 2024లో హాజరవుతున్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్...

పాలిసెట్ 2024 ఆన్‌ లైన్‌ రిజస్ట్రేషన్‌ Online Registration నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.250 ఫీజుగా నిర్ణయించారు. ఇతర క్యాటగిరీల విద్యార్ధులకు రూ.500 ఫీజుతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తారు.

తెలంగాణ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ దరఖాస్తులు సమర్పించడానికి ఏప్రిల్ 22 చివరి తేదీగా నిర్ణయించారు. రూ.100 ఆలస్య సుముతో ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులు అనుమతిస్తారు. రూ.300 తత్కాల్ రుసుముతో ఏప్రిల్ 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 2024 మే 17వ తేదీన పాలిసెట్ 2024 పరీక్ష నిర్వహిస్తారు.

ఫలితాల విడుదల...

పాలిసెట్‌ నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తారు. 2024 మే నెలాఖరుకు పాలిసెట్ 2024 ఫలితాలు వెలువడతాయి. మరిన్ని వివరాలకు పాలిటెక్నిక్ www.polycet.sbtet.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి. పాలిసెట్‌ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి లేదా polycet-te@telangana.govi.inకు మెయిల్ చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం