తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tslprb: ఇంటర్ అర్హతతో అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టులు.. నోటిఫికేషన్ జారీ

TSLPRB: ఇంటర్ అర్హతతో అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టులు.. నోటిఫికేషన్ జారీ

HT Telugu Desk HT Telugu

21 May 2022, 15:20 IST

google News
    • Telangana Fire Department Recruitment 2022 : రాష్ట్ర అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  అర్హులైన వారు మే 21 నుంచి మే 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మరో నోటిఫికేషన్
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మరో నోటిఫికేషన్

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మరో నోటిఫికేషన్

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన పోలీసు శాఖ.. తాజాగా అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఇంటర్ అర్హతతోనే..

ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అని నోటిఫికేషన్ లో పేర్కొంది. వయసు జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మే 21 నుంచే దరఖాస్తులు ‌అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నోటిషికేషన్‌ తేదీ నాటికి రెండేళ్లు.. అంతకంటే ముందు హెవీ మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ పొంది ఉండాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్‌, తదితర పూర్తి వివరాలు వెబ్‌సెట్‌లో వెల్లడించారు.

ఇక మరోవైపు పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తుల విషయంలోనూ బోర్డు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.  దరఖాస్తు గడువును మే 26వ తేదీ వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. 

మొత్తం కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు

కానిస్టేబుల్‌(సివిల్‌): 4965

కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423

కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100

కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010

కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390

ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610

వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136

వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10

కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262

కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21

కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100

మరోవైపు పోలీసు ఉద్యోగాలకు భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. మే 16 సాయంత్రం వరకు 6.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా మరోసారి గడవు పెంచటంతో సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

నోట్ : ఈ  <strong>లింక్ పై క్లిక్ చే</strong>సి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు…

టాపిక్

తదుపరి వ్యాసం