తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Minister Harish Rao Participated In 48th Gst Council Meeting

GST Council 48th meeting: ఆ పనులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి - మంత్రి హరీశ్‌

HT Telugu Desk HT Telugu

17 December 2022, 18:07 IST

    • 48th GST Council Meeting Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుంచి మినహాయింపులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
మంత్రి హరీశ్ రావ్
మంత్రి హరీశ్ రావ్ (twitter)

మంత్రి హరీశ్ రావ్

Minister Harish rao participated in GST Council Meeting: కేంద్ర ఆర్థిక శాఖ అధ్యక్షతన నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. చిన్ననీటి వనరుల నిర్వహణను జీఎస్టీ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్‌కు కూడా జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

1, తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. అయితే ప్రతి ఏడాది వీటి నిర్వహణ చేయడం ఎంతో ముఖ్యం. ఈ పనులు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తున్నది. ఈ నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అని కోరారు.

2, పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలుకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

3, బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాం. బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్ల మినహాయింపు ఇవ్వాలి.

4, టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్స్ అంశాన్ని స్వాగతిస్తున్నాము. అయితే దీనిపై ఉన్న సంశయాలను కౌన్సిల్ దృష్టికి తెస్తున్నాం. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్ వల్ల కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పే టీఎం, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాలి అని కోరారు.

చిన్ననీటిపారుదల, పీడీఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, రవాణా, బీడీ ఆకులపై జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను మండలి పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్ మెంట్ కమిటీకి సిఫార్సు చేసింది. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు.

బీఆర్కే భవన్ నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి హరీశ్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కమిషనర్ కమర్షియల్ టాక్స్ నీతూ ప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.