తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2024 : అలర్ట్... టీఎస్ లాసెట్ షెడ్యూల్ విడుదల - మార్చి 1 నుంచి దరఖాస్తులు, జూన్ 3న ఎగ్జామ్

TS Lawcet 2024 : అలర్ట్... టీఎస్ లాసెట్ షెడ్యూల్ విడుదల - మార్చి 1 నుంచి దరఖాస్తులు, జూన్ 3న ఎగ్జామ్

09 February 2024, 17:37 IST

    • TS Lawcet Schedule 2024 : తెలంగాణ లాసెట్ - 2024 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ముఖ్య తేదీలను పేర్కొన్నారు. జూన్‌ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది. 
తెలంగాణ లాసెట్ - 2024
తెలంగాణ లాసెట్ - 2024 (https://lawcet.tsche.ac.in/)

తెలంగాణ లాసెట్ - 2024

TS Lawcet Schedule 2024 Updates: ఈ ఏడాదికి సంబంధించిన ప్రవేశాల పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కీలక ప్రకటన చేసింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇందులో భాగంగా…. శుక్రవారం లాసెట్ - 2024 షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల 28 లా సెట్‌, పీజీ లా సెట్(ts lawcet 2024 exam date) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రకటించింది. జూన్‌ 3న ప్రవేశ పరీక్ష జరగనుంది.

TS Lawcet Schedule- తెలంగాణ లాసెట్ -2024 షెడ్యూల్ :

తెలంగాణ లాసెట్ - 2024 నోటిఫికేషన్ - ఫిబ్రవరి 28, 2024.

దరఖాస్తుల స్వీకరణ - మార్చి 1, 2024.

దరఖాస్తులకు తుది గడువు - ఏప్రిల్ 15, 2024.

ఆలస్య రుసుంతో - 25.మే.2024

లాసెట్ ప్రవేశ పరీక్ష - జూన్ 3, 2024.

కోర్సులు - మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.

అర్హతలు- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు.. డిగ్రీతో పాటు ఎల్ఎల్ బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

అధికారిక వెబ్ సైట్ - https://lawcet.tsche.ac.in/

మిగతా ప్రవేశ పరీక్షల తేదీలివే:

-EAPCET(ఎంసెట్ ) - మే 9 నుంచి 13 వరకు.

-మే 6వ తేదీన ఈసెట్‌.

-జూన్‌ 4,5 తేదీల్లో ఐసెట్‌.

-మే 23వ తేదీన ఎడ్‌సెట్‌.

తెలంగాణ పీజీఈసెట్ 6 జూన్, 2024 - 8, జూన్, 2024.

టీఎస్ పీఈసెట్ - 10.06.2024 - 13.06.2024.

ఈసెట్ ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ, ఎంసెట్ పరీక్షలను జేఎన్టీయూ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఎడ్ సెట్ ఎగ్జామ్ ను మహాత్మ గాంధీ వర్శిటీ, లాసెట్ - ఉస్మానియా వర్శిటీ, ఐసెట్ - కాకతీయ వర్శిటీ, పీజీఈసెట్ - జేఎన్టీయూ, టీఎస్ పీఈసెట్ ప్రవేశ పరీక్షను శాతవాహన వర్శిటీ నిర్వహించనుంది.

ఎంసెట్ పేరును EAPCETగా కూడా మార్చింది ప్రభుత్వం. మే 9 నుంచి 13 వరకు ఈ పరీక్షలు(EAPCET) జరగనున్నాయి. మే 6వ తేదీన టీఎస్ఈసెట్ ప్రవేశ పరీక్ష ఉండనుండగా… జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ ఎగ్జామ్ ఉంటుంది. గతంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్, ఇంజినీరింగ్ సీట్లను భర్తీ చేసేవారు. కానీ 2017 తర్వాత పరిస్థితి మారింది. ఎంసెట్‌ నుంచి మెడికల్‌ సీట్ల భర్తీని తొలగించి.... కేవలం ఇంజినీరింగ్ సీట్లను మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్‌, ఇతర వైద్యకోర్సులను జాతీయ ప్రవేశ పరీక్ష నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇదిలా ఉన్నప్పటికీ ఎంసెట్ పేరులో 'ఎం' అక్షరం అలాగే ఉండింది. అయితే ఇప్పుడు ఈ అక్షరాన్ని తొలగించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎం అక్షరాన్ని తొలగించాలని ఉన్నత విద్యా మండలి కూడా ప్రతిపాదనలు పంపటంతో.... ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగానే ఉన్నత విద్యా మండలి కొత్త పేరుతో ప్రకటన జారీ చేసింది.

తదుపరి వ్యాసం