Hyderabad techie dies in US : అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
18 May 2024, 8:41 IST
- Hyderabad techie dies in USA: అమెరికాలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది.
అమెరికాలో హైదరాబాదీ మృతి
Hyderabad techie dies in US: అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన మే 14వ తేదీన నార్త్ కరోలినాలో జరిగింది. మృతుడిని అబ్బరాజు పృథ్వీరాజు(30)గా గుర్తించారు.
హైదరాబాద్ లోని ఎల్పీ నగర్ కు చెందిన అబ్బరాజు పృధ్వీ రాజ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మృతుడి సోదరి ప్రత్యూష స్పందిస్తూ… సోదరుడి మృతి పట్ల బాధను వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితమే తమ తండ్రి చనిపోయాడని చెప్పారు. తన సోదరుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణించినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.
పృథ్వీరాజ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. పృథ్వీరాజ్ స్నేహితులు ఇక్కడికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని… శనివారం సాయంత్రం వరకు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.
‘‘ పృథ్వీరాజ్ గత ఎనిమిదేళ్లుగా యూఎస్‌లో ఉండి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అతడి స్నేహితులు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి సహకరిస్తున్నారు"అని బంధువులు వెల్లడించారు.
ఈ ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అనే 25 ఏళ్ల విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో శవమై కనిపించాడు. హైదరాబాద్‌లోని నాచారంకు చెందిన అర్ఫత్ క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గతేడాది మేలో అమెరికా వెళ్లాడు.
అతను మార్చి 7న అదృశ్యమయ్యాడు. పది రోజుల తర్వాత, అరాఫత్‌ను కిడ్నాప్ చేసినట్లు తేలింది. అతడిని విడుదల చేయడానికి కిడ్నాపర్లు 1200 డాలర్లను డిమాండ్ చేశారు. ఆ తర్వాత అర్ఫాత్ మృతదేహాం దొరికగా… ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు.
ఇటీవల అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉమా సత్య సాయి గద్దె అనే భారతీయ విద్యార్థి మరణించాడు. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. ఈ ఫిబ్రవరిలో చికాగోలో ఒక భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. దారుణమైన దాడిని ఎదుర్కొన్నాడు. దాడి తరువాత, చికాగోలోని భారత కాన్సులేట్ బాధితుడు సయ్యద్ మజాహిర్ అలీతో పాటు భారతదేశంలోని అతని భార్యతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది.