TS KGBV Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేజీబీవీలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
07 August 2023, 14:14 IST
- TS KGBV Jobs : తెలంగాణ కేజీబీవీలు, యూఆర్ఎస్ లలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 26 నుంచి జులై 7 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణ కేజీబీవీల్లో ఉద్యోగులు
TS KGBV Jobs : తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(KGBV), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(URS)లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విద్యాలయాల్లో మొత్తం 1,241 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాలకు మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టులకు జూన్ 26 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలకు జులైలో రాత పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష నిర్వహణకు వారం రోజుల ముందు అభ్యర్థుల హాల్ టికెట్లను వెబ్ సైట్ లో ఉంచుతారు.
పోస్టుల వివరాలిలా?
రాష్ట్రంలోని జిల్లాల వారీగా పోస్టుల వివరాలను సమగ్ర నోటిఫికేషన్ లో విడుదల చేయనున్నారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో స్పెషల్ ఆఫీసర్లు, కేజీబీవీల్లో పీజీసీఆర్‌టీలు, కేజీబీవీలు,యూఆర్‌ఎస్‌లలో సీఆర్‌టీ, పీఈటీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయున్నారు. ఈ పోస్టుల భర్తీకి అర్హతలు, దరఖాస్తు ఫీజు, ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్, మార్కులు వివరాలను నోటిఫికేషన్ తెలియజేశారు.
TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
Step 1 : schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Step 2 : హోమ్‌పేజీలో, తెలంగాణ KGBV రిక్రూట్‌మెంట్ 2023 అందుబాటులోకి వచ్చిన తర్వాత లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
Step 4 : TS KGBV దరఖాస్తు ఫామ్ ను పూరించండి. అడిగిన విధంగా అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
Step 5: ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి ఉపయోగం కోసం దాని ప్రింట్‌అవుట్‌ను పొందండి.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన
1,241 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని దరఖాస్తుదారులు గమనించాలి. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ KGBVలో ఖాళీల వివరాలను పేర్కొన్నారు. ప్రత్యేక అధికారి- 42, PGCRT - 849, CRT - 273, PET - 77 ఖాళీలు ఉన్నాయి. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, CRT ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారని అభ్యర్థులు గమనించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేస్తూ ఉండాలని అధికారులు సూచించారు.