MLAs Trap Case : సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
06 February 2023, 11:46 IST
- MLAs Trap Case ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కుదురైంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును సిబిఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులన సీజే నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.
తెలంగాణ హైకోర్టు
MLAs Trap Case ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిబిఐ విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో సిబిఐ విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లపై సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది.
టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించ వద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సిబిఐ దర్యాప్తుకు అనుకూలగా సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయలేమని చెప్పిన హైకోర్టు ధర్మాసనం, కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని అభిప్రాయపడింది.
మరోవైపు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయ స్థానంలో సవాలు చేయనున్నట్లు చెబుతున్నారు. హైకోర్టు తీర్పును 15రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. దానికి హైకోర్టు నిరాకరించింది.
టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగరు ఎమ్మెల్యేలను బీజపీలో చేర్చేలా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంపై సిబిఐ విచారణ జరపించాలని అభియోగాలు ఎదుర్కొంటున్న వారితో పాటు బీజేపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సిబిఐకు విచారణకు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తీర్పునిచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దర్యాప్తుతో పాటు ట్రాప్ వ్యవహారంపై సాగిన దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని ఆదేశించారు. హైకోర్టు సింగల్ బెంచ్ తీర్పును తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.తుకారాంలతో కూడిన ధర్మసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది.