తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. షరతులు తప్పనిసరి

బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. షరతులు తప్పనిసరి

HT Telugu Desk HT Telugu

09 April 2022, 6:42 IST

google News
    • శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసాలో శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శోభాయాత్ర కొనసాగనుంది.
శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి
శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి (tshc website)

శోభాయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి

శ్రీరామనవమి శోభాయాత్రపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బైంసా, హైదరాబాద్‌ లో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని పేర్కొంది. నిర్మల్‌ జిల్లా భైంసా, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.

శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకునే కొన్ని వీధుల్లో మాత్రమే శోభాయాత్రకు అనుమతిచ్చినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరక విచారించిన కోర్టు... హైదరాబాద్‌లో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. భైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, కుబేర్ అడ్డా, బస్టాండ్, చౌరస్తా, రాంలీలా మైదాన్ మీదుగా యాత్ర నిర్వహించుకోవచ్చునని ధర్మాసనం వెల్లడించింది. ఇక భాగ్యనగరంలో చూస్తే బోయిగూడ కమాన్, ధూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లీబౌలి మీదుగా ఊరేగింపు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. పోలీసుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం