తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jani Master Bail : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Jani Master Bail : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

24 October 2024, 13:14 IST

google News
    • Jani Master Bail : జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీమాస్టర్.. రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీపై కేసు నమోదు అయ్యింది.
జానీ మాస్టర్‌కు బెయిల్‌
జానీ మాస్టర్‌కు బెయిల్‌

జానీ మాస్టర్‌కు బెయిల్‌

లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. జానీకి బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తనపై జానీ మాస్టర్‌ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్‌ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.

కోర్టు ఆయకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లారు. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్‌ను ఈ నెల 14న కోర్టు తిరస్కరించింది. తాజాగా.. ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇవాళ సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌‌ను హైదరాబాద్ పోలీసులు గతనెల 20న అదుపులోకి తీసుకున్నారు. గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. అవుట్‌ డోర్‌ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది.

నార్సింగిలోనూ తనపై లైంగిక దాడి జరిగిందని యువతి ఫిర్యాదులో పేర్కొంది. 2017లో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేరానన్నారు. ఒక షో కోసం జానీకో కలిసి తాను ముంబయికి వెళ్లానని, అక్కడి హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదు తర్వాత జానీ మాస్టర్ పరారయ్యాడు. ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో పాటు ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదని అప్పట్లో పోలీసులు చెప్పారు. దీంతో జానీ మాస్టర్ కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. జానీ మాస్టర్ లద్దాక్ లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు టీమ్ లు ఆయన కోసం బయలుదేరాయి. ముందు ఆయన నెల్లూరులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అక్కడ లేరని స్థానిక పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని నార్సింగి పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం