తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Booster Dose : ఇంటింటికీ బూస్టర్ డోస్.. హరీశ్ రావు కీలక ఆదేశాలు

Booster Dose : ఇంటింటికీ బూస్టర్ డోస్.. హరీశ్ రావు కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

25 July 2022, 17:54 IST

google News
    • Corona Vaccination : తెలంగాణలో ఇంటింటికీ వెళ్లాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

Telangana Covid Booster Dose : సీజనల్‌ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. ఇంటికి వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. వారితో మంచిగా నడుచుకోవాలని కోరారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్టుగా తెలిపారు.

'పరిశుభ్రతపై ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహణ ఉంటుంది. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటింటికీ వెళ్లి బూస్టర్‌ డోస్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రజాప్రతినిధులు సైతం సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి.' మంత్రి హరీశ్‌రావు అన్నారు.

మంకీ ఫాక్స్ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. కామారెడ్డి వ్యక్తికి లక్షణాలు వస్తే.. ఫీవర్ ఆసుపత్రికి తరలించామన్నారు. పరీక్షల కోసం నమూనాలను.. పుణే వైరాలజీ ల్యాబ్ కు పంపామన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫీవర్ ఆసుపత్రికి రావాలన్నారు. విదేశాలు, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో పరీక్షలు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్టుగా హరీశ్ రావు తెలిపారు. అందరికీ కొవిడ్ బూస్టర్ డోస్ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొవిడ్ కేసులు వస్తున్నాయని.. ప్రజలు చాలా జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరించారు.

గడిచిన 24 గంటల్లో 24 వేల 927 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 531 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మెత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 8.14 లక్షలు అయింది. కొత్తగా కరోనా బారి నుంచి 612 మంది బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 వేల 630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

తదుపరి వ్యాసం