తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Prc : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్- పీఆర్సీ ఏర్పాటు, 5 శాతం ఐఆర్ ప్రకటన

TS Govt PRC : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్- పీఆర్సీ ఏర్పాటు, 5 శాతం ఐఆర్ ప్రకటన

02 October 2023, 21:55 IST

google News
    • TS Govt PRC : తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీను ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు ఉద్యోగులకు 5 శాతం ఐఆర్ ప్రకటించింది.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

TS Govt PRC : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్ చెల్లింపు కోసం వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటు చేసింది. ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(IR) ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ ఛైర్మన్ గా శివశంకర్, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది ప్రభుత్వం. ఆరు నెలల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

6 నెలల్లో నివేదిక

ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎస్ ఆదేశించారు. అలాగే 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

మంత్రి హరీశ్ రావు హర్షం

ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామని మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 9 ఏళ్లలో రెండు పీఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పీఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

తదుపరి వ్యాసం