తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ecet Results 2023 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TS ECET Results 2023 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

13 June 2023, 18:44 IST

google News
    • TS ECET Results 2023 : టీఎస్ ఈసెట్-2023 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం విడుదల చేసింది.
తెలంగాణ ఈసెట్ ఫలితాలు
తెలంగాణ ఈసెట్ ఫలితాలు

తెలంగాణ ఈసెట్ ఫలితాలు

TS ECET Results 2023 : తెలంగాణ ఈసెట్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి ఛైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి మంగ‌ళ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. తెలంగాణ ఈసెట్ ఫ‌లితాల్లో 93.07 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్‌లో ర్యాంకుల ఆధారంగా బీటెక్‌ కోర్సుల్లో ల్యాటరల్‌ ఎంట్రీ ( సెకండియర్) కల్పిస్తారు. ఈ ఏడాది మే 20న టీఎస్‌ ఈసెట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 22,454 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసెట్ ఫ‌లితాల విడుద‌ల కార్యక్రమంలో ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ ప్రొఫెస‌ర్ ర‌వీంద‌ర్, ఈసెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ శ్రీరామ్ వెంక‌టేశ్ పాల్గొన్నారు. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

టీఎస్ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు. ఎడ్‌సెట్‌ పరీక్షను మే 18న మూడు సెషన్లలో నిర్వహించారు. ఈ పరీక్షకు 86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఎడ్ సెట్ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఎడ్ సెట్ ఫలితాల్లో 26,994 అభ్యర్థులు (98.18 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జి.వినీష ఫస్ట్ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో సాధించారు.

జూన్ 20న ఏపీ ఈసెట్

ఏపీలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ ఈసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 12న వెబ్ సైట్ లో విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహించింది. జూన్ 20న ఏపీఈసెట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

తదుపరి వ్యాసం