TS Degree Colleges Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, డిగ్రీ కాలేజీల్లో 527 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
06 February 2024, 19:17 IST
- TS Degree Colleges Jobs : తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలపరిమితితో వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగాలు
TS Degree Colleges Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టుల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మందిని లెక్చరర్లను, 341 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో, 50 మందిని టీఎస్‌కేసీ మెంటర్లను, 1940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టుల కాలపరిమితి 2024 మార్చి 31తో ముగియనుంది. లెక్చరర్లు పోస్టులు -527, టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు-50, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు-1940, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు-29, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు- 31, స్టోర్ కీపర్- 40, జూనియర్ స్టెనో - 01, రికార్డు అసిస్టెంట్ పోస్టులు-38, మ్యూజియం కీపర్ పోస్టులు -07, హెర్బేరియం కీపర్ పోస్టులు -30, మెకానిక్ పోస్టులు- 08, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు-157 భర్తీ చేయనున్నారు.
జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ డేటా ఆఫీసర్, నాలెడ్జ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీసీఏ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జులై 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అంగన్వాడీ పోస్టుల భర్తీ
ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 61 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్-1 సూపర్‌వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.