Telangana Assembly Election Result 2023 Social Media Reaction Live Updates : రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
03 December 2023, 17:14 IST
- Telangana Assembly Election Result 2023 Social Media Reaction : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. 60కి పైగా స్థానాల్లో హస్తం జోరు చూపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే చాలా స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. దీంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెబుతున్నారు.
5.10 PM
కాంగ్రెస్ పార్టీకి ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వేదికగా పలువురు అభినందిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డినే సీఎం చేయాలని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. సోనియా గాంధీ బర్త్ డేకు రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు.
4.16 PM
తెలంగాణ ప్రజలంతా కలిసి కాంగ్రెస్‌ను గెలిపించారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.. పార్టీ గెలవడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉంది.. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో ప్రచారం బాగా జరిగింది.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది-థాక్రే
4.07 PM
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు.. నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం.. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించింది.. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ముందు ఉంటుంది.. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తాం, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తు్న్నాం-రేవంత్‌రెడ్డి
4.05 PM
సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయి.. ప్రగతి భవన్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్‌గా మారుతుంది.. ప్రగతి భవన్ కాదు.. ఇకపై అది ప్రజా భవన్.. ఏ సమస్యలు వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు-రేవంత్ రెడ్డి
3.59 PM
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ గెలవడంపై సోనియా, రాహుల్ కు అభినందనలు చెప్పారు. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు.
3.15 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 'ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందాం. తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
2.37 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. దీంతో సోషల్ మీడయాలో రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. దొరల పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడం చాలా గొప్పదని అంటున్నారు. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.