తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : 'పబ్' లో డ్రగ్ పార్టీ...! అర్ధరాత్రి నార్కోటిక్ పోలీసుల దాడులు

Hyderabad : 'పబ్' లో డ్రగ్ పార్టీ...! అర్ధరాత్రి నార్కోటిక్ పోలీసుల దాడులు

07 July 2024, 9:04 IST

google News
    • మణికొండలోని ‘దీ కేవ్‌ పఫ్‌ క్లబ్‌’లో తెలంగాణ నార్కొటిక్‌ బ్యూరో అధికారులు అర్ధరాత్రి సోదాలు చేశారు. ఇందులో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.
తెలంగాణ నార్కొటిక్‌  బ్యూరో అధికారుల సోదాలు
తెలంగాణ నార్కొటిక్‌ బ్యూరో అధికారుల సోదాలు

తెలంగాణ నార్కొటిక్‌ బ్యూరో అధికారుల సోదాలు

హైదరాబాద్ లో  డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో… మరింత దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నగరంలోని పలు పబ్బులపై  తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేపట్టారు.

మణికొండ లోని ‘దీ కేవ్‌ పఫ్‌ క్లబ్‌’పై(కేవ్ పబ్‌) సోదాలు నిర్వహించగా… విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి. ఇందులో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 20 మందికిపైగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వీరంతా కూడా 30 ఏళ్ల లోపు ఉన్న వారే అని సమాచారం. 

డ్రగ్స్ వాడకంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఎవరు కోనుగోలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. పబ్ నిర్వాహకులను విచారిస్తున్నారు. ఈ పార్టీ వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.

తదుపరి వ్యాసం