Telugu News Updates 10 February : డోర్నకల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
10 February 2023, 16:18 IST
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లనుంది. గురువారం రాత్రి కామపల్లి మండలం లచ్చ తండాలో నేతలతో కలిసి యాత్ర శిబిరంలో రేవంత్ రెడ్డి బస చేశారు. ఇవాళ ఉదయం నుంచే పాదయాత్రను ప్రారంభించారు.
బైఠాయింపు
YS Sharmila Protest at Raghunathpalli Substation: బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ప్రస్తుతం జనగామ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె... రఘునాథపల్లి సబ్ స్టేషన్ ముందు భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల... కరెంట్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 4గంటల పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). నిత్యం వేలాది భక్తులు తిరుపతికి రావటమే కాదు... వేర్వురు సేవల్లో పాల్గొంటుంటారు. వీరికోసం ప్రత్యేకంగా టికెట్లను విడుదల చేస్తుంది టీటీడీ. తాజాగా అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన టికెట్ల విడుదల వివరాలను వెల్లడించింది.
సరికొత్త ఆకర్షణ
హుస్సేన్ సాగర్ తీరంలో సరికొత్త అందాలు దర్శనమిస్తున్నాయి. మ్యూజికల్ వాటర్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటైంది. రంగుల వెలుగుల్లో మ్యూజిక్‌కు అనుగుణంగా ఎగిసిపడే నీటిని చూసి నగరవాసులు ముగ్ధులవుతున్నారు. ఈ ఫౌంటెయిన్ ను గురువారం రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ ప్రారంభించారు. సంగీతానికి అనుగుణంగా నీళ్లు ఎగిసి పడుతుంటాయి. కలర్ ఫుల్ లైటింగ్ మధ్య వాటర్ డాన్స్ చేస్తుంటే.. ప్రతి ఒక్కరూ వావ్ అనాల్సిందే. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు సార్లు మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ఉంటుంది.
సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.... నూతన సచివాలయ టూంబ్స్ (గుమ్మటాలు)ను కూల్చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా కూకుట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లిలో తలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతిని ధ్వంసం చేస్తామని... నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామని కామెంట్స్ చేశారు.
రేవంత్ యాత్ర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లనుంది. గురువారం రాత్రి కామపల్లి మండలం లచ్చ తండాలో నేతలతో కలిసి యాత్ర శిబిరంలో రేవంత్ రెడ్డి బస చేశారు. ఇవాళ ఉదయం నుంచే పాదయాత్రను ప్రారంభించారు.
కీలక ప్రకటన
ఫిబ్రవరి నెలఖారులో పోడు భూముల పంపిణీ చేపడుతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం... పోడు భూముల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. దాదాపు పదకొండున్నర లక్షలకు పైగా భూములు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని... వీటిని అందజేసే ఏర్పాట్లు కూడా సిద్ధమవున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. అడవులు నరకబోమని రాతపూర్వక హామీ ఇచ్చే వారికి మాత్రమే పోడు భూములు ఇస్తామని... ఇవ్వని వారికి ఎట్టిపరిస్థితుల్లో కేటాయించమని తేల్చి చెప్పారు.
ప్యాకేజీ
IRCTC Tourism Tirupati Ooty Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఊటీతో పాటుగా కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది.
అమిత్ షా టూర్
ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రి అమిత్ షా హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. శనివారం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ లో జరిగే ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొనేందుకు ఆయన నగరానికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ రాత్రి 10:15 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి రోడ్డుమార్గం ద్వారా వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
ప్రమాదం
కారును ఢీసీఎం ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మనూరు గేట్ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారును డీసీఎం బలంగా ఢీకొట్టడంతో చనిపోయారు. వీరంతా కూడా హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగినట్లు తెలుస్తోంది.
అవగాహన తరగతులు
T- SAT Awareness Classes For Inter Students: టీ -శాట్... ఉద్యోగ అభ్యర్థులతో, చదవుకుంటున్న విద్యార్థుల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తూ వస్తోంది. విషయ నిపుణులతో ప్రత్యక్ష తరగతులతో పాటు... వీడియోలను రికార్డు చేసి అందుబాటులో ఉంచుతుంది. ప్రాక్టీస్ పరీక్షలు కూడా రాసేలా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీ-శాట్. ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక టైమింగ్స్ ను ప్రకటించింది. ఆ వివరాలు చూస్తే.....