తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

06 September 2024, 10:32 IST

google News
    • Jitta Balakrishna Reddy: మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణా రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు.  తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. 2009లో యువతెలంగాణ పార్టీ స్థాపించారు. 
జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత (jitta)

జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. 2009లో బీఆర్ఎస్ పార్టీని వీడారు. 2009 ఎన్నికల్లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ‌్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత యువ తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో యువజన సంఘాల నాయకుడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 2023 అక్టోబర్ 20న తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న జన్మించారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో LB నగర్ నుండి డివీఎం డిగ్రీ & పీజీ కళాశాల నుండి బి.కామ్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల పొత్తులో భాగంగా భువనగిరిని టీడీపీకి కేటాయించడంతో మనస్తాపం చెందారు. ఆ పార్టీని విడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ లోక్‌సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని వీడారు. అనంతరం సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత ఏడాది తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు.

తదుపరి వ్యాసం