తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Paper Leak: వికారాబాద్‌లో పదో తరగతి పేపర్ లీక్..పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు

TS Paper Leak: వికారాబాద్‌లో పదో తరగతి పేపర్ లీక్..పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు

HT Telugu Desk HT Telugu

04 April 2023, 17:16 IST

google News
    • TS Paper Leak: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాప్రతం లీకైందనే వార్తలు కలకలం రేపాయి. ఉదయం 9.37కే వాట్సాప్‌లో  ప్రశ్నాపత్రం బయటపడినట్లు వెలుగుచూడటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి ప్రమేయంతో ప్రశ్నాపత్రం లీకైందని అధికారులు గుర్తించారు.
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్

TS Paper Leak: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం బయటకు రావడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరులో పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్త కలకలం రేపింది. పరీక్షకు ముందే వాట్సాప్ లో ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. తొలుత వికారాబాద్ డీఈవో రేణుక దేవి ఈ వార్తలను ఖండించారు. జిల్లాలో ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు. ఎస్ఎస్ సీ 2023 ఎగ్జామ్స్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రేణుక దేవి వివరణ ఇచ్చారు.

పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ పూర్తిగా నిషేధించామని, తాను 4 పరీక్షా కేంద్రాలు విజిట్ చేసి వచ్చానని చెప్పారు. కానీ ఎక్కడా ఎలాంటి రిమార్క్స్ గానీ, కంప్లైంట్స్ గానీ రాలేదన్నారు. తనకు పేపర్ లీకేజీపై ఎలాంటి సమాచారం రాలేదని, తన ఫోన్ కు కూడా ఎలాంటి పేపర్ రాలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై ఇంటలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వికారాబాద్ కలెక్టరేట్లో డీఈవో, విద్యాశాఖ అధికారులు సమావేశం అయ్యారు. జిల్లాలో పలువురికి వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తెలుస్తోంది. ఆ తర్వాత డీఈవో హుటాహుటిన కలెక్టరెట్ కు వెళ్లినట్టు సమాచారం.

పదో తరగతి పరీక్షలు ప్రారంభానికి ముందే వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టిందంటూ వార్తలు వచ్చాయి. పదో తరగతి పరీక్షలు ఈ రోజు 9.30కు ప్రారంభం అయ్యాయిజ. మొదటి పేపర్ తెలుగు ఉదయం 9:37కే వాట్సాప్ లో ప్రత్యక్షం అయిందని విద్యార్ధల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈవ్యవహారంపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

తాండూర్‌‌లో పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టినట్టు గుర్తించారు. తాండూర్ మండల కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించారు. పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

తాండూరులోని ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్లో పేపర్ లీకేజ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్‌కు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప ఫోన్ నుంచి వాట్సప్‌లో షేర్ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉపాధ్యాయుడు బందెప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజ్‌పై బందెప్పను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యాశాఖ అధికారులు ప్రకటించినా, వాట్సాప్‌ గ్రూపుల్లో స్క్రీన్‌ షాట్లు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేపర్ లీకేజ్ వార్తలను పోలీసులు నిర్ధారించారు.

తదుపరి వ్యాసం