MLA Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ…
08 February 2023, 12:07 IST
- MLA Poaching Case ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
Supreme court on MLAs Poaching case
MLA Poaching Case ఎమ్మెల్యేలకు ఎర కేసును సిబిఐకు అప్పగించాలనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై అత్యవసరం విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో బుధవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మంగళవారమే అత్యవసర విచారణ జరపాలని కోరినా బుధవారం పరిశీలిస్తామని సీజే ప్రకటించారు. కోర్టు ప్రారంభమైన వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టేఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు సిట్ దర్యాప్తుపై స్టేటస్ కో ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో ప్రభుత్వ వాదనల్లో ఏదైనా మెరిట్స్ ఉంటే హైకోర్టు ఉత్తర్వులను రివర్స్ చేస్తామని చెప్పారు. కేసు విచారణను ఈ నెల 17 నుంచి వింటామని ప్రకటించాచు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకున్న విధంగా ఉపశమనం లభించకపోవడంతో, డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ నమోదు చేసిన ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందన్న ఏజీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓసారి సీఎస్‌కు సీబీఐ లేఖ రాసిందని చెప్పిన అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ముందుకు ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో యథాతథ స్థితిని అమలు చేయడానికి స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు లో మెరిట్స్ ఉంటే హై కోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.