తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr: ప్రయాణికులకు అలర్ట్… 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SCR: ప్రయాణికులకు అలర్ట్… 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

HT Telugu Desk HT Telugu

22 July 2022, 14:25 IST

google News
    • south central railway: ప్రయాణికుల రద్దీ దృష్టా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. సికింద్రాబాద్‌-అగర్తల-సికింద్రాబాద్‌, రామేశ్వరం-సికింద్రాబాద్‌ మధ్య ఈ సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
52 స్పెషల్ ట్రైన్స్
52 స్పెషల్ ట్రైన్స్

52 స్పెషల్ ట్రైన్స్

south central railway special trains: ప్రయాణికుకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. రద్దీ దృష్టా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్‌-అగర్తల-సికింద్రాబాద్‌, రామేశ్వరం-సికింద్రాబాద్‌ మధ్య 52 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది.

secunderabad agartala special trains: సికింద్రాబాద్‌-అగర్తల మధ్య ఆగస్టు 15,22,29, సెప్టెంబరు 5,12,19,26 తేదీల్లో ప్రత్యేక రైలు(07030)ను నడుపుతున్నట్టు వివరించారు. సోమవారం 04.35 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గురువారం ఉదయం 3 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇక అగర్తల-సికింద్రాబాద్‌ మధ్య ఆగస్టు 19,26, సెప్టెంబరు 2,9,16,23,30తేదీల్లో ప్రత్యేక రైళ్లు(07029) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శుక్రవారం అగర్తలా నుంచి ఉదయం 6.10 నిమిషాలకు బయల్దేరి ఆదివారం 04.15 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

secunderabad rameswaram special trains: సికింద్రాబాద్‌- రామేశ్వరం మధ్య ఆగస్టు 24,31, సెప్టెంబరు 7,14,21,28 అక్టోబర్‌ 5,12,19,26, నవంబర్‌ 2,9,16,23,30 డిసెంబర్‌ 7,14,21,28 తేదీల్లో ప్రత్యేకరైలు(07685) నడుస్తుందన్నారు. బుధవారం రాత్రి 07.05 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే రైలు... గురువారం రాత్రి 11.40 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. రామేశ్వరం- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేకరైలు (07686) ఆగస్టు 26, సెప్టెంబరు 2,9,16,23,30, అక్టోబర్‌ 7,14,21,28 తేదీల్లో, నవంబర్‌ 4,11,18,25, డిసెంబర్‌ 2,9,16,23,30 తేదీల్లో నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ స్పెషల్ ట్రైన్ శుక్రవారం ఉదయం 8.50 నిమిషాలకు రామేశ్వరం నుంచి బయల్దేరి శనివారం మధ్యాహ్నం 12.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుటుంది.

<p>స్పెషల్ ట్రైన్స్ వివరాలు</p>

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్ తో పాటు సెకండ్ సిటింగ్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

తదుపరి వ్యాసం