తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : హైదరాబాద్-నాగర్ సోల్ స్పెషల్ ట్రైన్స్

South Central Railway : హైదరాబాద్-నాగర్ సోల్ స్పెషల్ ట్రైన్స్

Anand Sai HT Telugu

23 August 2022, 18:50 IST

google News
    • Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. హైదరాబాద్ టూ నాగర్ సోల్ ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు (unplash)

ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్-నాగర్ సోల్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. రైలు నెంబర్ 07089 ఆగస్టు 24న హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09.25 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07090 ఆగస్టు 25న నాగర్ సోల్ లో రాత్రి 10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటుంది.

ఈ రైళ్లు లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గీర్, లాతూర్ రోడ్, పర్లి, గంగఖేర్, పర్భాని, సెలు, పర్తూర్, జల్నా, ఔరంగబాద్ రైల్వే స్టేషనల్లో ఆగుతుంది. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ - నాగర్ సోల్ మధ్య ఇటీవలే ప్రత్యక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈట్రైన్ 27వ తేదీన హైదరాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి - మరునాడు ఉదయం 09.25కు చేరుకుంటుంది. ఇక నాగర్ సోల్ నుంచి - హైదరాబాద్ కు 28వ తేదీన ప్రత్యేక రైలు ఉంది. ఇది రాత్రి 10 గంటలకు ప్రారంభమై... మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇక హైదరాబాద్ - యశ్వంతపూర మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. 25వ తేదీన హైదరాబాద్ నుంచి బయల్దేరే రైలు... మరుసటి రోజు ఉదయం 10. 30 గంటలకు యశ్వంత్ పూర్ చేరుతుంది. ఇక 26వ తేదీన యశ్వంతపూర నుంచి 04.15 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ కు చేరుతుంది.

సికింద్రాబాద్ - యశ్వంతపూర్ - సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు. ఇది 26, 27 తేదీల్లో సర్వీసును అందిచనుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరుతుంది. తిరిగి యశ్వంతపూర్ నుంచి సాయంత్రం 05. 20వ తేదీన బయల్దేరి... మరోసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ కు వస్తుంది. 27వ తేదీన సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ కు ప్రత్యేక రైలు ఉంది. ఇది 10.35 గంటలకు బయల్దేరి... మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చేరుతుంది. 28వ తేదీన నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. నర్సాపూర్ - వికారాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది.

తదుపరి వ్యాసం