MMTS Hyderabad : నగర వాసులకు గుడ్ న్యూస్.. మేడ్చల్ రూట్‍లో కొత్తగా 6 MMTS సర్వీసులు - వివరాలివే
07 October 2023, 9:00 IST
- South Central Railway News: MMTS ప్రయాణికులకు గుడ్ న్యూస్. మేడ్చల్, లింగంపల్లి స్టేషన్ల మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దీంతో పాటు మేడ్చల్, హైదరాబాద్ స్టేషన్ల మధ్య కూడా నూతన MMTS రైళ్లను నడపుతోంది.
మేడ్చల్ - హైదరాబాద్ మధ్య 6 కొత్త MMTS రైళ్లు
South Central Railway Latest News: మేడ్చల్ - లింగంపల్లి, మేడ్చల్ - హైదరాబాద్ మధ్య కొత్తగా ఆరు MMTS రైళ్ళను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది.రోజువారీ ప్రయాణికులు,ఉద్యోగులు, విధ్యార్ధులు ఎక్కువగా ఈ మార్గాల మధ్య ప్రయాణం చేస్తుండడంతో వారి ప్రయాణాన్ని మరింత సులభం, సురక్షితం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మేడ్చల్ - లింగంపల్లి మధ్య 4 MMTS రైళ్లు, మేడ్చల్ - హైదరాబద్ మధ్య 2 MMTS రైళ్ళను ఉదయం మరియు సాయంత్రం రద్దీ సమయాల్లో నడపనునట్లు వెల్లడించింది. వీటితో పాటు అదనంగా జంట-నగర ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి దక్షిణ మధ్య రైల్వే ఉమ్దానగర్ - సికింద్రాబాద్ మరియు ఫలక్‌నుమా - సికింద్రాబాద్ మధ్య ఆరు MMTS సేవలను కూడా ప్రవేశపెట్టింది. సబర్బన్ ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మేడ్చల్ - లింగంపల్లి సెక్షన్ మధ్య నాలుగు కొత్త సర్వీసులను ప్రవేశపెట్టడంతో జంటనగర ప్రాంతంలో MMTS సేవలు ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చనుట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
MMTS రైలు మొదటిసారిగా మేడ్చల్ మరియు హైదరాబాద్ స్టేషన్ల మధ్య కనెక్టివిటీని ప్రవేశపెట్టిందని తెలిపింది. వివిధ ప్రయాణీకుల విభాగాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా అక్టోబర్ 1, 2023 న కొత్త టైమ్ టేబుల్‌లో MMTS సేవల సమయాలు సవరించబడ్డాయని వివరించింది. కార్యాలయ ప్రయాణీకుల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ… వివిధ MMTS స్టేషన్‌ల్లో పీక్ ట్రాఫిక్ ను అధిగమించడానికి ఈ సేవలు రూపొందించబడ్డాయని పేర్కొంది సౌత్ సెంట్రల్ రైల్వే.
ఈ సేవలు నగరంలోని ఔటర్-సబ్ అర్బన్ ప్రాంతాల రైలు కనెక్టివిటీని బలోపేతం చేస్తాయంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. మరీ ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు మొదలైన వారికి ప్రయోజనకరంగా ఈ రైళ్లు ఉంటాయని తెలిపింది. ఇటీవలే ప్రారంభించిన కాచిగూడ-బెంగళూరు (యశ్వంత్‌పూర్) వందే భారత్ రైళ్లు సమయానికి కూడా ఈ MMTS సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ…. ఆఫీస్ ఉద్యోగులు మరియు వివిధ పనులు మరియు కుటుంబ బాధ్యతల కారణంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారి ప్రయాణ డిమాండ్లను తీర్చడం కోసం బోర్డు కొత్త టైమ్ టేబుల్ ను నియమించిందన్నారు. జంట నగర ప్రాంతంలోని ఎక్కువ మంది రైలు ప్రయాణికులు ఇప్పుడు దీని ప్రయోజనాన్ని పొందవచ్చన్నారు.MMTS ప్రయాణం అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వేగంతమైన మరియు సురక్షితమైన ప్రయాణమన్నారు.