తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy District : మరణాంతరం ఘనంగా పెళ్లిరోజు వేడుక - ఆ తల్లి కోరికను ఇలా తీర్చారు

Sangareddy District : మరణాంతరం ఘనంగా పెళ్లిరోజు వేడుక - ఆ తల్లి కోరికను ఇలా తీర్చారు

HT Telugu Desk HT Telugu

02 March 2024, 9:22 IST

google News
    • Mother 50th Wedding Anniversary : తల్లిమీద ప్రేమతో వినూత్నంగా వేడుక కార్యక్రమాన్ని నిర్వహించింది సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబం. తల్లి మరణానంతరం 50వ పెళ్లిరోజు వేడుకను ఘనంగా చేసింది. 
తల్లి విగ్రహాంతో పెళ్లిరోజు వేడుకలు
తల్లి విగ్రహాంతో పెళ్లిరోజు వేడుకలు

తల్లి విగ్రహాంతో పెళ్లిరోజు వేడుకలు

Mother 50th Wedding Anniversary : తమ తల్లికి ఇచ్చిన మాట, ఆమె మరణం తర్వాత కూడా నిలబెట్టుకున్నారు ఆ మహిళా యొక్క ఐదుగురు కుమారులు . పేదరికం కారణంగా, ఆ మహిళా 50 సంవత్సరాల క్రితం అతి సాధారణంగా వివాహం చేసుకున్నది, ఆర్ధికంగా కొద్దిగా స్థిర పడటంతో తన ఐదుగురు కొడుకుల పెళ్లిళ్లు అంగరంగ వైభోవంగా జరిపించింది. తన పెళ్లిప్పుడు కనీసం దండాలు కూడా మార్చుకోలేదని, తమ 50 పెళ్లి రోజుని పెద్ద ఎత్తున బందు మిత్రుల మధ్య జరుపుకోవాలని తన కోరికను తన కుమారులకు, కోడళ్ళకు తెలియజేసింది ఆ మహిళా. అమ్మ కోరికను ఎలాగైనా తీరుస్తామని, కొడుకులు, కోడళ్ళు హామీ ఇచ్చారు విధివశాత్తు, ఆ మహిళా తన 50 పెళ్లిరోజుకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు తీవ్ర అనారోగ్యం పాలై మృతి చెందింది. అయినా ఆ కుమారులు… తల్లి కోరిక మేరకు తన విగ్రహాన్ని తయారు చేయించారు. తమ తండ్రితో పాటు పక్కన్నే మరొక కుర్చీలో విగ్రహం ఏర్పాటు చేసి , వారి 50వ పెళ్లిరోజుని శుక్రవారం రోజు ఘనంగా జరిపించారు . ఈ ఉత్సవానికి సుమారుగా 1,500 మంది బందు మిత్రులు హాజరై ఆ కుటుంబానికి తమ ఆశీస్సులు అందజేశారు.

అప్పట్లో అతి సాధారణంగా వివాహం....

వివారాల్లోకి వెళ్తే…, సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల గ్రామానికి చెందిన, చెన్నంశెట్టి సత్యనారాయణ, నాగలక్ష్మి దంపతులు 50 సంవత్సరాల క్రితం అతి సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరానికి చెందిన ఆ కుటుంబం, బతుకుదెరువు కోసం 1978 లో గుమ్మడిదలకు వలస వచ్చారు. సత్యనారాయణ, రైస్ మిల్లులో మెకానిక్ గా పనిచేస్తూ, తన కుటుంబానికి పోషించుకునేవాడు. గుమ్మడిదలకు వచ్చిన తర్వాతనే, ఆ దంపతులకు నలుగురు కుమారులు జన్మించారు. కాలక్రమేనా, పిల్లలు పెద్దగా కావటం ఒక్కొక్కరు ఒక్క బిజినెస్ లో దిగటం వలన ఆ కుటుంబానికి కొంత ఆర్ధిక స్థిరత్వం వచ్చింది.

ఆ దంపతులు… తమ ఐదుగురు కుమారులకు పెళ్లిళ్లు చేయటం, వారికీ 10 మంది మనమల్లు, మనవరాండ్లు పుట్టడం వలన వారి జీవితం ఎంతో హాయిగా సాగుతూ వచ్చింది. ఈ సమయంలోనే, నాగలక్ష్మి, తన 50 పెళ్లి రోజు కోరికను కొడుకుల ముందు, కోడండ్ల ముందు వెలిబుచ్చింది. వారందరు, దానికి ఎంతో సంతోషం తప్పకుండా చేద్దాం అని ఒప్పుకొన్నారు. అయితే, ఫిబ్రవరి 2, 2023 లో తీవ్ర అనారోగ్యంతో నాగలక్ష్మి మృతి చెందటంతో, ఆ కుటుంబాన్ని తీవ్ర దుఖంలోకి నెట్టింది. తన 50వ పెళ్లిరోజు 2024, మార్చి 1 నాడు చేయాలిసి ఉండగా, ఇలా జరగడం, ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.

తల్లి లేని విషాద సమయంలోనూ ఆ కుటుంబం మొత్తం తన తల్లి కోరిక తీర్చాలని నిర్ణయం తీసుకుంది. తమ తల్లి విగ్రహం తయారు చేయించి 50 వ పెళ్లి రోజు ఘనంగా జరిపించారు. తల్లిపైనా వారికున్న ప్రేమ చూసి, బంధుమితృలందరు అశీర్వదించారు. ఆ కుటుంబానికి అభినందనలు, ఆశీస్సులు అందజేశారు.

 

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం