తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

05 January 2024, 19:42 IST

google News
    • Mahabubnagar Road Accident Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 
రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

Road Accident in Mahabubnagar: ఆటో - డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం… మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఏం జరిగిందంటే…?

బాలానగర్ లో జరిగే వారపు సంతకు పలు తండాలకు చెందిన గిరిజనులు వచ్చారు.కూరగాయలతో పాటు ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో… ఓ చోటు ఆగిన ఆటోను డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు… ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను బాలానగర్ మండల పరిధిలోని పలు తండాలకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

ఈ ఘటనతో స్థానిక తండా వాసులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

నాగోల్ లో విషాదం - తండ్రికొడుకులు మృతి

ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.టిప్పర్ లారీ,ఎలక్ట్రిక్ స్కాటీ ఢీ కొన్న ఘటనలో తండ్రి కొడుకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో లారీ కాలి బూడిద అయింది.నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరెల్లి పాపాయి గూడ చౌరస్తా వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన కుత్తడి కుమార్,అతని కుమారుడు ప్రదీప్ ( 7వ తరగతి చదువుతున్నాడు) ఎలక్ట్రిక్ స్కూటర్ పై వెళుతున్నారు.ఈ క్రమంలోనే పాపాయి గూడ చౌరస్తా రాగానే.....ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బైక్ ఢీ కొట్టడంతో.....టిప్పర్ లారీ క్యాబిన్ లో ఒకసారిగా మంటలు చెలరాయి. ఆ మంటల్లో టిప్పర్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్దమయ్యాయి. వీటితో పాటు ప్రదీప్ కూడా మంటల్లో సజీవ దహనమయ్యాడు.ప్రదీప్ తండ్రి సైతం తీవ్ర గాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు ఒకేసారి మరణించడంతో మృతుల గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి దేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే టిప్పర్ లారీ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నట్లు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం