తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay Deeksha : దిగొచ్చిన సర్కార్, దీక్షను రద్దు చేసుకున్న బండి సంజయ్

Bandi Sanjay Deeksha : దిగొచ్చిన సర్కార్, దీక్షను రద్దు చేసుకున్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

09 April 2024, 19:49 IST

    • Bandi Sanjay Deeksha : సిరిసిల్ల నేతన్నలకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న బండి సంజయ్ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో బండి సంజయ్ నేతన్న దీక్ష విరమించుకున్నారు.
 బండి సంజయ్
బండి సంజయ్

బండి సంజయ్

Bandi Sanjay Deeksha : సిరిసిల్లలో నేత కార్మికుల(Sircilla Weavers) సమస్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay)ఈనెల 10న చేపట్టే నేతన్న దీక్ష రద్దైంది. నేతన్నలకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్త ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇవ్వడంతో బండి సంజయ్ తన దీక్షను తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. 6 గ్యారంటీల (Congress 6 Guarantees)పేరుతో ప్రజలను మోసం చేసిన విధంగా ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు దొంగ హామీలిచ్చి నేతన్నలను మోసం చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వం హామీని ఎన్నికల కోడ్ మొగిసే లోపే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికలు ముగిసిన అనంతరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే దీక్ష చేపట్టక తప్పదని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

ఫలించిన నేతన్నల పోరాటం

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని, ఈ విషయంలో నేతన్నలకు అండగా నిలిచిన వారందరికీ బండి సంజయ్ (Bandi Sanjay) అభినందనలు తెలిపారు. గత 4 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ... భిక్షాటన వంటి కార్యక్రమాల ద్వారా తమ దుస్థితిని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడంతోపాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను నెరవేర్చుకున్న నేత కార్మికులకు, ఆసాములకు బీజేపీ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం బతుకమ్మ చీరెల(Bathukamma Sarees) ఉత్పత్తికి సంబంధించి రావలసిన పాత బకాయిలు రూ.270 కోట్లను చెల్లించడం తోపాటు వస్త్ర పరిశ్రమ యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు కొత్త ఆర్డర్లు, విద్యుత్ బిల్లులపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని, 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలి

నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ (Worker To Owner) పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్(Bandi Sanjay). సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ(Sircilla Handloom) సంక్షోభ నివారణకు, నేతన్నల అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. చేనేత మిత్ర కింద ప్రతి మగ్గంపై పనిచేసే కార్మికుడికి నెలకు 2 వేల రూపాయల నూలు రాయితీ 2 నెలల మాత్రమే ఇచ్చి నిలిపివేశారు. వెంటనే రాయితీ కొనసాగించడంతోపాటు రాయితీ మొత్తాన్ని పెంచాలని, ఈ విషయంలో నేతన్నల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. నేతన్న బీమా(Netanna Beema) పథకంలో చేరాలంటే గరిష్ట వయో పరిమితి 75 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పవర్ లూమ్స్ పై నేతన్నలకు ఉపాధి పెంచేందుకు ఏటా 500 కోట్ల రూపాయల ఉత్పత్తులకు ఆర్డర్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతన్నల కుటుంబాల వాస్తవ ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయించి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందేలా నా వంతు కృషి చేస్తానని ప్రకటించారు.

HT Correspondent K.V.REDDY, Karimnagar

తదుపరి వ్యాసం