తెలుగు న్యూస్  /  Telangana  /  Single Notification For All Group Category 4 Jobs In Telangana

Group 4 Jobs: గ్రూప్‌ 4 ఉద్యోగాల అప్డేట్.. ఒకే నోటిఫికేషన్ తో పోస్టులన్నీ భర్తీ!

HT Telugu Desk HT Telugu

24 June 2022, 14:14 IST

    • గ్రూపు -4 ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానికతతో పాటు పోస్టుల విషయంలో కొత్త సర్వీసు నిబంధనలు రూపొందిస్తోంది. త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్
త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్

త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్

Group 4 Jobs in Telangana: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.త్వరలోనే సీఎం ఆమోదం తెలిపితే అన్నీ పోస్టులకు కలిపి ఒకే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న 9618 ఉద్యోగాల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి. అన్ని జిల్లాల్లో, శాఖాధిపతుల కార్యాలయాల్లో కిందిస్థాయిలోని ఈ పోస్టులు చాలా ఖాళీగా ఉండడం వల్ల పరిపాలన పరమైన సమస్యలు ఏర్పడుతున్నందున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

కొత్త నిబంధనలు...

గ్రూప్‌–4 కొలువులకు కొత్తగా సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది ప్రభుత్వం. కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇదివరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో పదోన్నతులు ఇతర అంశాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది.

ఇప్పటికే పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు.శాఖాధిపతుల నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. కొద్దిరోజుల్లో దీంతో అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందనున్నాయి. ఇవి అందిన వెంటనే సమీక్షించి గ్రూప్‌–4 నూతన సర్వీసు రూల్స్‌ను ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గ్రూపు -4లోని ఉద్యోగాలు...

జూనియర్ అసిస్టెంట్. టైపిస్ట్, స్టెనో వంటి పోస్టులు ఇందులో ఉంటాయి. అయితే టైపిస్ట్, స్టెనోలోనూ జూనియర్, సీనియర్ లెవల్ ఉద్యోగాలు ఉంటాయి. వీటిలో గెజిటెడ్, నానా గెజిటెడ్ కేటగిరీలు కూడా ఉన్నాయి. వీటికి వేర్వురు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఎగ్జామ్..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించే.. గ్రూపు 4 ఉద్యోగాలకు పేపర్ - 1, పేపర్ -2 పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలకు గానూ 150 మార్కులు ఉంటాయి. రెండో పేపర్ లోనే ఇదే విధంగా ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో గరిష్ఠ మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు.

సిలబస్ ఇదే..

పేపర్-1 లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్(General Knowledge) నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం గంటన్నర ఉంటుంది. కరెంట్ ఆఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సామాన్యశాస్త్రం, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు , భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యంతో పాటు తెలంగాణ రాష్ట్ర విధానాల వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇక పేపర్ -2లో మొత్తం 150 మార్కులు ఉంటాయి. ఇందులో సెక్రటేరియల్ సామర్ధ్యాల (Secretarial Abilities) నుంచి ప్రశ్నలు వస్తాయి. పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్, న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ -1లో పై విధంగా సూచించిన అంశాలు ఉండగా.. ఇక పేపర్ -2లో మాత్రం సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందుకు సంబంధించిన సిలబస్ ను నోటిఫికేషన్ సమయంలో టీఎస్పీఎస్సీ విడుదల చేస్తుంది. అయితే ఫైనల్ నోటిఫికేషన్ సమయంలో సిలబస్ లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు

టాపిక్