తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mangli Road Accident: గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం, మంగ్లీతో పాటు మరో ఇద్దరు సురక్షితం

Mangli Road Accident: గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం, మంగ్లీతో పాటు మరో ఇద్దరు సురక్షితం

Sarath chandra.B HT Telugu

18 March 2024, 13:09 IST

google News
    • Mangli Road Accident: సినీ, జానపద నేపథ్య గాయని మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మంగ్లీ ప్రయాణిస్తున్న వాహనంపై డిసిఎం దూసుకెళ్లింది. 
సింగర్ మంగ్లీ
సింగర్ మంగ్లీ (twitter)

సింగర్ మంగ్లీ

Mangli Road Accident: తెలుగు గాయనిగా, నటిగా గుర్తింపు పొందిన మంగ్లీ అలియాస్ సత్యవతి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సినీ నేపథ్య గాయని, తెలుగులో పలు ఆల్బమ్‌లతో మంగ్లీ గుర్తింపు పొందారు. గతంలో న్యూస్ ఛానల్స్‌లో పనిచేసిన ఆమె గాయనిగా పాపులర్ అయ్యారు.

శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో డిసిఎం వాహనం మంగ్లీ బృందం ప్రయాణిస్తున్న కారుపైకి దూసుకెళ్లింది.

శంషాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తొండుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనలో మంగ్లీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు ధృవీకరించారు.

ఓ అధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.ఓ టీవీ ఛానల్‌కు సంబంధించిన పార్టీలో పాల్గొని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనపై మంగ్లీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలుగులో పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాటు సినీ గీతాలను కూడా ఆలపించారు. పలు చిత్రాల్లో ఆర్టిస్ట్‌గా నటించారు.

తదుపరి వ్యాసం