తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Ja Results : సింగరేణి జేఏ ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

Singareni JA Results : సింగరేణి జేఏ ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu

11 September 2022, 7:53 IST

google News
    • singareni collieries company limited jobs:సింగరేణి జేఏ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు వెబ్ సైట్ లో రిజల్ట్స్ ను అందుబాటులో ఉంచారు.
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు (scclmines.com)

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు

singareni junior assistant posts 2022:సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌(జేఏ) పోస్టుల ఫలితాలు వచ్చేశాయి. జేఎన్టీయూహెచ్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డి, సింగరేణి డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ ఈ ఫలితాలను శనివారం విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రకటించారు.

రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఈ నెల 4న నిర్వహించిన 177 పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. ఇందుకు 77,898 మంది హాజరవ్వగా, ఇందులో 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. పరీక్షలో ఇచ్చిన ఓ మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో సరైన సమాధానం లేనందున అభ్యర్థులందరికీ మూడు మార్కులు కలిపామని వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థుల రిజర్వేషన్‌, స్థానికత, మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని వారం రోజుల్లోగా ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పరీక్షకు సంబంధించి.. ప్రాథమిక కీ ని సెప్టెంబర్ 05, 2022న అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. సింగరేణి వెబ్ సైట్ scclmines.com ద్వారా అభ్యంతరాలను కూడా స్వీకరించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మూడు ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించి... ఫలితాలను ప్రకటించింది.

singareni junior assistant results: ఇలా చెక్ చేసుకోండి...

అభ్యర్థులు scclmines.com వెబ్ సైట్ కి వెళ్లాలి.

'Junior Assistant Grade-II (External) Examination Results' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఫలితాల జాబితాకు సంబంధించి పీడీఎఫ్ అందుబాటులో ఉంటుంది.

ఇందులో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి.

NOTE

లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను జాబితాను డైరెక్ట్ గా పొందవచ్చు.

మరోవైపు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో గోల్‌మాల్ జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. పేపర్‌ లీక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. ఓ స్టడీ సెంటర్ నిర్వాహకుడు అభ్యర్థుల నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన అభ్యర్థులతో సదరు స్టడీ సెంటర్ నిర్వాహకుడు ప్రత్యేకంగా పరీక్ష రాయించాడని సమాచారం. గోవాలో పరీక్ష నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా ప్రచారం అవుతోంది.

మరో మూడు పరీక్షా కేంద్రాల్లోనూ అభ్యర్థులు పరీక్షాలు రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కామ్ కు సంబంధించి.. ముగ్గురు సింగరేణి అధికారుల కూడా ఉన్నారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. స్టడీ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం