Investments in Telangana: తెలంగాణకు మరో పెట్టుబడి - 400 కోట్లతో ఆయిల్ రిఫైనరీ
13 October 2022, 7:33 IST
- refinery company in telangana: తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ కు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
రూ. 400 కోట్లతో ఆయిల్ రిఫైనరీ
singapore company investing ₹400 crore in telangana: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా సింగపూర్ కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్, ఫ్రీడమ్ ఆయిల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనుంది.
జెమిని ఎడిబుల్స్ సంస్థ రూ.400 కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ సమీపంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి సమావేశమయ్యారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు కంపెనీకి కృతకజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.
తెలంగాణలో హరిత, నీలి, గులాబి, శ్వేత విప్లవాలు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో పసుపు విప్లవం దిశగా కూడా వెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. జెమిని ఎడిబుల్స్ సంస్థ పెట్టుబడి రాష్ట్రంలో వంటనూనెల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లోనూ తెలంగాణలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తామని జెమిని ఎడిబుల్స్ సంస్థ ఎండీ ప్రదీప్ తెలిపారు. వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.
indian immunologicals : హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ తయారీ సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL ) కూడా భారీ పెట్టుబడి పెట్టనుంది. ఇక్కడి జీనోమ్ వ్యాలీలో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.700 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇది ఫుట్-అండ్-మౌత్ డిసీజ్ (FMD), ఇతర అభివృద్ధి చెందుతున్న వ్యాధుల వంటి వాటికోసం టీకాలను అభివృద్ధి చేయనుంది. ఈ కంపెనీ ద్వారా మొత్తం 750 మందికి ఉపాధిని లభిస్తుంది. అక్టోబర్ నెలలోనే కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో భేటీ అయి… పలు అంశాలపై చర్చించారు.
biological e investments in telangana: గత కొద్దిరోజుల కిందటే తెలంగాణలో టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగం భారీ విస్తరణకు బీఈ సంస్థ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ... రూ. 1800 కోట్లు పెట్టుబడులను పెట్టనుంది. ఫలితంగా ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీ ఎత్తున పెంచనుంది. దీనిద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించనుంది. తాజా నిర్ణయంతో... కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే
బయోలిజికల్ -ఈ దక్షిణ భారతదేశంలోనే మొదటి ఔషధ తయారీ సంస్థ. దేశంలో బయోలిజికల్ ఉత్పత్తులను తయారు చేసిన ప్రైవేట్ సంస్థ కూడా ఇదే. ప్రస్తుతం 4 వ్యాపార విభాగాలు ఉన్న బీఈకీ తెలంగాణలో 6 తయారీ కేంద్రాలు ఉన్నాయి.
టాపిక్