తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Shamirpet Mro In Acb Trap : ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో, పాస్ బుక్ కోసం రూ.40 లక్షల లంచం

Shamirpet MRO in ACB Trap : ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో, పాస్ బుక్ కోసం రూ.40 లక్షల లంచం

13 February 2024, 23:24 IST

google News
    • Shamirpet MRO in ACB Trap :శామీర్ పేట తహసీల్దార్ రూ.10 లక్షలు తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డాడు. ధరణిలో వివరాలు నమోదు చేసేందుకు మొత్తం రూ.40 లక్షల లంచం డిమాండ్ చేశాడు.
ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో
ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో

ఏసీబీ వలలో చిక్కిన శామీర్ పేట ఎమ్మార్వో

Shamirpet MRO in ACB Trap : తెలంగాణ ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. తహసీల్దార్ ఆఫీసులోనే రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. శామీర్‌పేట త‌హ‌సీల్దార్ సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారుల‌కు చిక్కాడు. అనంత‌రం ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాల‌యంతో పాటు ఇంట్లో సోదాలు చేశారు. పాస్‌బుక్‌ల జారీ కోసం తహసీల్దార్ సత్యనారాయణ రూ. 10 ల‌క్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు.

అసలేం జరిగింది?

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గచ్చిబౌలిలో ఉంటున్న రామశేషగిరిరావు నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టుబడ్డాడు. రామశేషగిరిరావు శామీర్‌​పేటలో కొంత భూమి ఉంది. దీనికి పట్టాదారు పాసు బుక్ జారీ చేసేందుకు, అనుకూలంగా కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు తహసీల్దార్ సత్యనారాయణ రామశేషగిరిరావు నుంచి రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. శామీర్‌పేట లాల్‌గాడి, మలక్‌పేట గ్రామ పరిధిలో ఏపీలోని గుంటూరు జిల్లా కు చెందిన మొవ్వ రామశేషగిరిరావు 2006లో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందులో 10 ఎకరాలు విక్రయించగా, తన పేరుపై 29 ఎకరాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తన భూమిని ధరణిలో అప్‌లోడ్ చేసి పాస్​పుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్ సత్యనారాయణను కోరారు. అయితే తహసీల్దార్ ముందు రూ.40 లక్షలు డిమాండ్ చేశాడు. ముందు రూ.10 లక్షలు అడిగగా...ఆ నగదు చెల్లించాడు. అయితే ఏడాదిగా తిరుగుతున్నా, ఇంకా రూ.30 లక్షలు ఇవ్వాలని ఎమ్మారో శేషగిరిరావును వేధించాడు. 2009లో రూ.20 లక్షల చెక్కు​ఇస్తే, మరో రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు తీసుకొని కూడా తహసీల్దార్ పాస్ బుక్ లు జారీచేయకపోవడం బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

రెడ్ హ్యాండెట్ గా చిక్కిన ఎమ్మార్వో

ఏసీబీ అధికారులు తహసీల్దార్ సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. తహసీల్దార్ డ్రైవర్ కు లంచం ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా తహసీల్దార్ ఆదేశాలతోనే డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ ముందు నిజం చెప్పేశాడు. దీంతో తహసీల్దార్, అతని డ్రైవర్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎమ్మారో ఆఫీస్, ఇంట్లో సోదాలు నిర్వహించింది. నిందితుడు సత్యనారాయణకు కరీంనగర్, హైదరాబాద్ లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

దూద్ బౌలి సబ్ రిజిస్ట్రాన్ అరెస్టు

ఏసీబీ వలలో ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ తో పాటు మరో వ్యక్తి చిక్కాడు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 2లక్షలు లంచం తీసుకుంటూ దూద్ బౌలి ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అమైర్ పర్వేజ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్ షాలి బండకు చెందిన సయ్యద్ షాబాజ్ రెండు సేల్ డీడ్‌ల రిజిస్ట్రేషన్‌కు దూద్ బౌలి సబ్ రిజిస్ట్రార్ అమైర్ పర్వేజ్ రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అయితే సయ్యద్ షాబాజ్ ఒప్పుకోకోపతే సయ్యద్ షాబాజ్ ముందుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ముఖ్య అనుచరుడైన గోపిసింగ్ ద్వారా రూ. 2 లక్షలు తీసుకోన్నారు. నిందితులిద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఎవరైన ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

తదుపరి వ్యాసం