తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cabinet Decisions: రాష్ట్రంలోని Vraల క్రమబద్ధీకరణ... తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

TS Cabinet Decisions: రాష్ట్రంలోని VRAల క్రమబద్ధీకరణ... తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

HT Telugu Desk HT Telugu

18 May 2023, 20:04 IST

google News
    • Telangana Cabinet Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో)
ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో)

ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana Cabinet Meeting Updates: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశం.. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. దాదాపు మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌ల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు.

కేబినెట్ ముఖ్య నిర్ణయాలు

-నకిలీ విత్తనాల సరఫరా చేసే వారిపై పీడీ యాక్టులు పెట్టాలని మంత్రవర్గం నిర్ణయం.

- మక్కలు, జొన్నలు కొనేందుకు కేబినెట్ నిర్ణయం.

-ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కిమ్ పేజ్ 1, 2 కేబినెట్ నిర్ణయం.

-111 జీవో ను ఎత్తివేస్తూ నిర్ణయం. హెచ్ఎండీఏ పరిధి విధివిధానాలే జోవో 111 గ్రామాలకు 84 గ్రామాలకు వర్తింపజేసేలా నిర్ణయం.

-కులవృత్తుల బలోపేతం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.

-తెలంగాణలో 38 డీఎంహెచ్ వో పోస్టులు మంజూరు

-కొత్తగా ఏర్పాటైన 40 మండలాలకు పీహెచ్ సీలు మంజూరు.

-హుస్సేన్ సాగర్ ను గోదావరి జలాలతో నింపాలని మంత్రివర్గం నిర్ణయం.

-జైన్ కమ్యూనిటీ వారిని మైనార్టీ కమిషన్ పరిధిలోకి తీసుకురావటం. ఆ వర్గానికి చెందినవారికి సభ్యుడిగా -కూడా అవకాశం కల్పిస్తారు. మొత్తం కమిషన్ లో 9 మంది సభ్యులు అవుతారు.

-తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 10 కొత్త పోస్టులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం.

- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు ఘనంగా జరుపుతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం ఉంటుంది.

- వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం.

- హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కలుషితం కాకుండా చూడాలని నిర్ణయం.

- రెండో విడత గొర్రెల పంపిణీకి కేబినెట్ నిర్ణయం.

- వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.

-వ్యవసాయ రంగంలో మార్పుల కోసం వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ.

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టు భవన్‌, ఇళ్ల స్థలాల కోసం 23 ఎకరాలు కేటాయింపు.

-కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల, ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం, విధివిధానాలు రూపొందించే బాధ్యత అప్పగింత.

తదుపరి వ్యాసం