తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Jeevan Reddy : పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్

MLC Jeevan Reddy : పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్

24 October 2024, 13:58 IST

google News
    • పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గంపగుత్తగా 10 మంది ఎమ్మెల్యేలను వేరే పార్టీలో నుండి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ప్రస్తావించారు.పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలకంగా పనిచేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్‌పై పోరాడానని గుర్తు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే.. తన అనుచరుడిని కిరాతకంగా చంపేశాడని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఆవేదనలో ఉన్నానని లేఖలో ప్రస్తావించారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి… తాజా రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గంపగుత్తగా 10 మంది ఎమ్మెల్యేలను వేరే పార్టీలో నుండి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా ప్రభుత్వాన్ని నడపలేమా అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరిట పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహిస్తున్నారని.. ఈ విధానం ఏ మాత్రం సరికాదన్నారు.

ఈ పార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకొని ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సలహాలు బాగా ఇస్తాడంటూ కామెంట్స్ చేశారు.

తదుపరి వ్యాసం