తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Blood Banks: అక్రమాలకు పాల్పడుతున్న బ్లడ్‌ బ్యాంకుల సీజ్.. నాలుగు బ్లడ్‌ బ్యాంకులపై డ్రగ్‌ కంట్రోల్ బోర్డ్ చర్యలు

Hyd Blood Banks: అక్రమాలకు పాల్పడుతున్న బ్లడ్‌ బ్యాంకుల సీజ్.. నాలుగు బ్లడ్‌ బ్యాంకులపై డ్రగ్‌ కంట్రోల్ బోర్డ్ చర్యలు

HT Telugu Desk HT Telugu

20 February 2024, 11:14 IST

google News
    • Hyd Blood Banks: బ్లడ్‌ బ్యాంకుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై  డ్రగ్‌ కంట్రోల్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌లో ‌Hyderabad పలు బ్లడ్‌ బ్యాంకుల్ని అధికారులు సీజ్ చేశారు. 
హైదరాబాద్‌లో పలు బ్లడ్ బ్యాంకుల్ని సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ బోర్డు
హైదరాబాద్‌లో పలు బ్లడ్ బ్యాంకుల్ని సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ బోర్డు (HT_PRINT)

హైదరాబాద్‌లో పలు బ్లడ్ బ్యాంకుల్ని సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ బోర్డు

Hyd Blood Banks: నగరంలో బ్లడ్ బ్యాంకుల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న బ్లడ్ బ్యాంక్ లపై డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ చర్యలు తీసుకొంది. నగరంలోని శ్రీకర హాస్పిటల్ Srikara Hospital బ్లడ్ బ్యాంక్,న్యూ లైఫ్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల New Life Blood Bank Society లైసెన్స్ రద్దు చేస్తూ సోమవారం డ్రగ్స్ కంట్రోల్ అండ్ అడ్మినిస్టరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎండలు ముదురుతూ ఉండడం..... ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో నగరంలోని రక్తదాన శిబిరాలు ఆశించిన మేర నిర్వహించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు రక్తనిది కేంద్రాల్లో రక్తపు నిలువలు నిండుకున్నాయి. దీనిని పలు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఆసరాగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా Plasma,ప్లెట్లెట్స్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. ఈ రక్త పిశాచుల పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన డ్రగ్స్ కంట్రోల్ Drug Control board అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకుల పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగానే శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్,న్యూ లైఫ్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ల్లో తనిఖీలు నిర్వహించి వాటి లైసెన్స్ రద్దు చేశారు.

అక్రమ మార్గాల్లో రక్తం విక్రయం...

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఐపీఎమ్ సహా 76 ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్జీవో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల పుట్టిన రోజుల సందర్బంగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు.

ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలామంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. దాతలు నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు.

దాతల నుంచి సేకరించిన రక్తంలో ఒక 30 శాతం రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులైన ఉస్మానియా,గాంధీ మరియు ఇతర ఆస్పత్రులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. కొందరు దుర్మార్గులు నిబంధనలు పాటించకుండా రక్తాన్ని అక్రమ మార్గంలో అత్యవసర రోగులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

మియాపూర్ లో రెండు బ్లడ్ బ్యాంక్ ల లైసెన్స్ రద్దు....

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్తస్రావంతో బాధపడుతూ ఉంటారు. ఇటు గర్భిణులు ప్రసవాల సమయంలో పాటు పలు కీలక సర్జరీల సమయంలో కూడా వారికి రక్తస్రావం అధికంగా ఉంటుంది. అలాంటి వారికి తక్షణమే వారి గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది.

డెంగీ జ్వరంతో బాధపడే వారికి తెల్ల రక్త కణాలు ఎక్కించాల్సి ఉంటుంది.అత్యవసర పరిస్థితులు రోగుల బంధువులు నమూనాలు తీసుకొని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్థు ఉంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకొని హోల్ బ్లడ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ను ఆ బ్లడ్ బ్యాంకులో సామర్థ్యానికి మించి నిల్వచేసి మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.

రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు రోగుల బంధువులకు విక్రయిస్తున్నారు.ఈనెల 2న డ్రగ్స్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మూసాపేట్ లోని హేమా సర్వీస్ లాబరేటరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సామర్ధ్యానికి మించి రక్తాన్ని నిలువ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

నిర్వాహకులు ఆర్ రాఘవేంద్ర నాయక్ అక్రమంగా ప్లాస్మాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్ లోని శ్రీకర్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మరియు న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో కూడా సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి రెండు బ్లడ్ బ్యాంకు లైసెన్స్ రద్దు చేశారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)

తదుపరి వ్యాసం