Medak Accident: మెదక్‌లో గణేష్ మండపం వద్ద అపశృతి, విద్యుత్ షాక్ తో పారిశుద్ధ కార్మికుడు మృతి..
10 September 2024, 14:06 IST
- Medak Accident: మెదక్ జిల్లాలో గణేష్ మండపం వద్ద అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి మండపం వద్ద శుభ్రం చేసేందుకు వెళ్ళిన పారిశుద్ధ కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా హవెలి ఘన్పూర్ మండలం రాజపేట లో సోమవారం చోటుచేసుకుంది.
వినాయక చవితి మండపంలో విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
Medak Accident: మెదక్ జిల్లాలో గణేష్ మండపం వద్ద అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి మండపం వద్ద శుభ్రం చేసేందుకు వెళ్ళిన పారిశుద్ధ కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా హవెలి ఘన్పూర్ మండలం రాజపేట లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజపేటకు చెందిన దాసరి పోషయ్య (60) గ్రామ పంచాయితీలో పారిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
రోజు మాదిరిగానే సోమవారం ఉదయం కూడా విధుల్లో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుభ్రం చేయడానికి వెళ్ళాడు. ఆ మండపం వద్ద కరెంట్ కోసం జే వైరు తో కరెంట్ వైర్లు కట్టారు. అది గమనించని పోషయ్య ఆ వైర్లను పక్కన పెట్టి ఉడ్చడానికి పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ తీగకు కరెంట్ సరఫరా కావడంతో షాక్ తగిలి పోషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
గణేష్ మండపం వద్ద ఉన్న వారి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు, నిర్వాహకులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అప్పటికే పోషయ్య మృతి చెందినట్లు గ్రామస్థులు నిర్ధారించుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మృతుడికి భార్య రమవ్వ, కొడుకు, కోడలు ఉన్నారు. విధులకు వెళ్ళిన భర్త కరెంట్ షాక్ తో మృతిచెందడంతో భార్య రమవ్వ గుండెలవిసేలా రోదిస్తుంది. మృతుడి కోడలు మౌనిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంగారెడ్డిలో మరొక ఘటన ..…
ఇంటి నుండి వెళ్లిన గణేష్ విగ్రహాల తయారీ కార్మికుడు నీటి గుంటలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు సమీపంలో రాజస్థాన్ కు చెందిన ప్రకాష్ సోలెం (28) కుటుంబీకులతో కలిసి గణపతి విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రకాష్ సోమవారం ఉదయం వరకు తిరిగి రాలేదు.
సోమవారం సంగారెడ్డి పట్టణంలోని శిల్ప వెంచర్ సమీపంలోని నీటి గుంటలో పడి మృతి చెందినట్లు అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రకాష్ సోలెం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎ
వరైనా హత్యా చేసారా.... లేదా ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందడా .. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడి భార్య చంపాబాయి పిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.