Bangladesh Kabaddi Coach: బంగ్లాదేశ్ కబాడ్డీ కోచ్‌గా సంగారెడ్డి ఆటగాడు
21 September 2023, 9:41 IST
- Bangladesh Kabaddi Coach: సంగారెడ్డి జిల్లాకు చెందిన కబడ్డీ ఆటగాడు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏషియన్ గేమ్స్-2023 లో బంగ్లాదేశ్ కబడ్డీ టీం కి ప్రధాన కోచ్ గ నియమితులయ్యారు.
బంగ్లాదేశ్ కబాడ్డీ కోచ్‌గా సంగారెడ్డి ఆటగాడు
Bangladesh Kabaddi Coach: సంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగి, కబడ్డీ ఆటలో ఓనమాలు నేర్చిన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, త్వరలో జరుగునున్న ఏషియన్ గేమ్స్ లో బంగ్లాదేశ్ కబడ్డీ పురుషుల జట్టుకి ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. శ్రీనివాస్ రెడ్డి.. కంది మండలంలోని ఉత్తరపల్లి గ్రామంలో పుట్టారు. భారత జట్టుకి ఆడటంతో పాటు, ఇండియా పురుషుల జట్టుకి కోచ్ గా కూడా వ్యవరించాడు.
శ్రీనివాస రెడ్డి కోచ్‌గా ఉన్నప్పుడు ఇండియన్ కబడ్డీ టీం 2018 లో దుబాయ్ మాస్టర్స్ కప్ లో విజేతగా నిలిసింది. ఈ సంవత్సరం మొదట్లో బాంగ్లాదేశ్ జూనియర్ కబడ్డీ టీంకి బంగ్లాదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఎంపిక చేసింది. ప్రపంచంలో 12 అత్యుత్తమైన జట్లు పాల్గొన్న ఈ ప్రపంచ కప్‌లో, బాంగ్లాదేశ్ టీం ఆరవ స్థానంలో నిలిచింది. శ్రీనివాస్ రెడ్డి కోచింగ్ పట్ల పూర్తి సంతృప్తి చెందిన బంగ్లాదేశ్ క్రికెట్ అసోసియేషన్, సీనియర్ టీం ప్రధాన కోచ్‌గా నియమించింది.
హర్యానాకి చెందిన వెటరన్ కోచ్ ఛాజు రామ్ గోయత్‌తో కలిసి బంగ్లాదేశ్ జట్టుకు శిక్షణను ఇస్తున్నారు. ఆసియన్ గేమ్స్ సెప్టెంబర్ 23 నుండి చైనాలోని హాంగ్జులో మొదలు కానున్నాయి. బంగ్లాదేశ్ జట్టుకు 45 రోజుల కోచింగ్ కోసం భారతదేశానికి తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని కొల్లహాపూర్లో, భారత్ కి చెందిన క్లబ్ జట్టులతో కలిసి కఠినమైన శిక్షణ అందించారు. కబడ్డీ ఆటలో ప్రఖ్యాతి చెందిన ఇండియన్ ఆటగాళ్లతో కలిసి ఆడటంతో రాబోయే ఆసియన్ గేమ్స్ ముందు మంచి అనుభవాన్ని ఇస్తుంది అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
శ్రీనివాస్ రెడ్డి 2014 లో దక్షిణ కొరియా లో జరిగిన ఇంచీయోన్ ఆసియన్ గేమ్స్ లో దక్షిణ కొరియా పురుషుల జట్టుకి కోచ్ గ వ్యవరించాడు. ఈ ఆసియన్ గేమ్స్, దక్షిణ కొరియా జట్టు మొట్ట మొదటి సారి కాంస్య పథకం గెలుసుకుంది. అదేవిదంగా, శ్రీనివాస్ రెడ్డి ఆస్ట్రేలియా సీనియర్ టీం కి కోచ్ గ పనిచేసి ఆ జట్టు కీలక విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. ఇండియన్ జూనియర్ కబడ్డీ టీం 2016 లో బంగారు పతకం గెలిసినప్పుడు, ఆ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.
ప్రఖ్యాతి చెందిన ప్రో-కబడ్డీ లీగ్ టోర్నమెంట్ లో జైపూర్ పింక్ పాంథర్స్జట్టుకి కోచ్ గా వ్యవరించాడు. డిసెంబర్ లో జరుగనున్న ప్రో-కబడ్డీ లీగ్ లో, తెలుగు టైటాన్స్ టీం కోచ్ గా పని చేయనున్నారు. 2005 లో శ్రీనివాస్ రెడ్డి భారత్ జట్టుకి ఆసియన్ ఛాంపియన్ షిప్ లో ఆడి బంగారు పతకం గెలుచుకున్నారు. సంగారెడ్డి లో అంబెడ్కర్ స్టేడియంలో సాధన చేసిన శ్రీనివాస్ రెడ్డి, విదేశీ జట్లకు కోచ్‌గా వ్యవహరించడం, సంగారెడ్డి ప్రజలకు మాత్రమే కాదు, తెలంగాణ కి మొత్తం గర్వకారణంగా మారింది.