Pharmahub Protest: మాకొద్దు ఫార్మా హబ్ అంటూ అధికారుల్ని ముట్టడించిన సంగారెడ్డి రైతులు
06 September 2024, 8:30 IST
- Pharmahub Protest: తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక-సంగారెడ్డి బోర్డర్లో ఉన్న న్యాల్కల్ మండలంలో సుమారుగా 2,000 ఎకరాలలో,ఫార్మా హబ్ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించగా, మాకొద్దు ఈ ఫార్మా హబ్ అని ఈ గ్రామాలకు చెందిన రైతులు పంచాయత్ కార్యదర్శి,ఎంపిడిఓ ల ను పంచాయత్ ఆఫీస్ లో బంధించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఫార్మా హబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు
Pharmahub Protest: తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక-సంగారెడ్డి బోర్డర్లో ఉన్న న్యాల్కల్ మండలంలో సుమారుగా 2,000 ఎకరాలలో,ఫార్మా హబ్ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించగా, మాకొద్దు ఈ ఫార్మా హబ్ అని ఈ గ్రామాలకు చెందిన రైతులు పంచాయత్ కార్యదర్శి, ఎంపిడిఓ ల ను పంచాయత్ ఆఫీస్ లో బంధించిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
న్యాల్కల్ మండలంలోని డప్పూరు, వడ్డీ, మల్గి గ్రామంలో 2,003 ఎకరాలలో ఫార్మా హబ్ పెడతామని తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు మాసంలో గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, అయితే మాకు ఎలాంటి సమాచారం లేకుండానే, గ్రామసభలు కూడా పెట్టకుండానే ప్రభుతం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని స్థానికి రైతులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
బుధవారం పంచాయతీ ఆఫీస్ కు వచ్చిన కార్యదర్శి జై సింగ్ ను, ఇట్టి విషయం పై ప్రశ్నించగా తనకు ఆ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంబంధం లేదని తాను బదులిచ్చాడు. ఆ సమాధానం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు, తనను పంచాయత్ ఆఫీస్ లో బంది చేసి, బయట నుండి ఆఫీస్ కు తాళం వేశారు.
జై సింగ్ ఎంత నచ్చ జెప్పిన గ్రామస్తులు తనమాట వినకపోవడంతో, తాను తన పై అధికారియినా ఎంపిడిఓ సురేష్ కు సమాచారం అందించాడు. హుటహుటిన న్యాల్కల్ నుండి, డప్పూరు గ్రామానికి వచ్చిన సురేష్ రైతులకు ఎంత నచ్చజెప్పిన తన మాట వినకపోగా, తనను కూడా పంచాయత్ ఆఫీస్ లో బంధించడం అధికారులందరికీ ఆందోళన కలిగించింది.
పోలీసులతోను తీవ్ర వాగ్వివాదం…
తాను వెంటనే, హద్దనూర్ పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై తన బలగం తో అక్కడి చేరుకున్నాడు. అయితే గ్రామస్తులు చాలా ఎక్కువ మంది పొగవ్వటంతో, ఎస్సై మాట కూడా వినలేదు. ఎస్సై అధికారులని విడిపించడానికి ప్రయత్నం చేయగా, వారు పెద్ద ఎత్తున అడ్డుకొని ధర్నా దిగారు.
పరిస్థితి తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తుండగా, హద్దనూర్ ఎస్సై సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ కు సమాచారం అందించారు. తాను వెంటనే, మరిన్ని పొలిసు బలగాలతో, జహీరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ హనుమంతు ని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితి చక్కదిద్దాలని ఆదేశాలు జారీచేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన హనుమంతుకు, ప్రభుత్వ వ్యతిరేఖ స్లోగన్ లతో వెల్కమ్ చెప్పారు గ్రామ రైతులు.
ఎస్పీ హామీతో......
హనుమంతు ఎంత జెప్పిన రైతులు వినకపోగా, తనతో కూడా తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ఎస్పీకి ఎప్పటికి కప్పటికే సమాచారం అందిస్తున్న ఇన్స్పెక్టర్, ఎస్పీ రూపేష్ రైతులను కలెక్టర్ తో కల్పించి ఒక మీటింగ్ ఏర్పాటు చేపిస్తామని చెప్పటంతో వారు కొంత మేరకు శాంతించారు. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా, తమ భూములను ఫార్మా హబ్ కోసం ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు.
ఒకవేళ ప్రభుత్వం,, తమ భూములని తీసుకోవాలాంటి, తమ న్యాయంగా భూమికి భూమి ఇచ్చి ముందలకి వెళ్లాలని డిమాండ్ చేసారు. ఎట్టకేలకు రెండు గంటలకు పైగా ప్రయత్నం తర్వాత, గ్రామస్తులు, కార్యదర్శి జై సింగ్ ను, ఎంపిడిఓ సురేష్ ను పంచాయత్ ఆఫీస్ నుండి బయటకు వదిలారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ ప్రతినిధి, హెచ్‌టి తెలుగు)