తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Saddula Bathukamma: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula bathukamma: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

HT Telugu Desk HT Telugu

11 October 2024, 6:37 IST

google News
    • Saddula bathukamma: పూల పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు తొమ్మిది రోజులపాటు కన్నుల పండులా నిర్వహించారు. చివరిరోజు దుర్గాష్టమి రోజున తీరోక్కపూలతో నిలువెత్తు బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడి పాడారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలు
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలు

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలు

Saddula bathukamma: తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో ఊరు వాడ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళలు సద్దుల సంబురాల్లో పాల్గొని కన్నుల పండువలా నిర్వహించారు. కరీంనగర్ లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

భవానీ శరణు ఘోషతో మారుమ్రోగిన అమ్మవార్ల ఆలయం

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదోవ రోజు అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.

నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేంద్ర మంత్రి తో పాటు కరీంనగర్ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి ప్రతిమ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం సంజయ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలిసి ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.

వర్షంలో సద్దుల బతుకమ్మ*

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహాశక్తి ఆలయంలో మహిళలు, యువత ఆట పాటలతో సందడి చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బతుకమ్మ పాటలతో అలరించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా కనువిందు చేశాయి.

రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం