తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gaddar Songs : గద్దర్… మీ పాటనై వచ్చాడు... పొడుస్తున్న పొద్దై ప్రశ్నించాడు

Gaddar Songs : గద్దర్… మీ పాటనై వచ్చాడు... పొడుస్తున్న పొద్దై ప్రశ్నించాడు

06 August 2023, 18:05 IST

google News
    • Gaddar Podusthunna Poddumeeda Song: పొడుస్తున్న పొద్దు అస్తమించింది...! పేదోడి గొంతుక మూగబోయింది. గాయిదోళ్ల గాండ్ర గొడ్డలి నిష్క్రమించింది. ప్రజాయుద్ధ నౌకగా ఈ దేశం సాంస్కృతిక విప్లవంపై తన ముద్ర వేసిన ‘గద్దర్న’ పాట తెలియని పల్లె, పట్టణం లేదంటే అతిశయోక్తి కాదు.
ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతి
ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతి (Janasena Twitter)

ప్రజాయుద్ధ నౌక గద్దర్ మృతి

Revolutionary Poet Gaddar Songs : పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ.... తెలంగాణ ఉద్యమ పాటై నిలిచాడు. మీ పాటనై వస్తున్నాను అంటూ పేదోడి గళంగా మారాడు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ గద్దరన్న గానం నిటారుగా నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించింది. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది. తొలి నాళ్లలో"ఆపర రిక్షా" అంటూ పాటను రాసిన గద్దర్.... 1972లో జన నాట్య మండలిలో క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చాడు. నాడు పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించటంలో ముందు వరుసలో నిలిచాడు. నక్సలైట్ ఉద్యమంలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన...ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తన గళాన్ని ఆపలేదు. గద్దరన్న పాట అంటే తెలియని పల్లె,పట్టణం ఉండదు. ప్రజాయుద్ధనౌకగా అనేక ప్రజాస్వామిక పోరాటాలకు దన్నుగా నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాధనలో కూడా ప్రజాఫంట్ ఏర్పాటు చేసి... ప్రజాస్వామిక తెలంగాణను ఆకాంక్షించాడు.

ప్రజల కష్టాలను పాట రూపంలో వినిపించి... ప్రభుత్వాలను కదిలించే శక్తి గద్దర్ పాటకు మాత్రమే ఉంది. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అంటూ తెలంగాణ తల్లి దుఖాన్ని తన పాట రూపంలో ఆవిష్కరించాడు గద్దర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ’పాట.... యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించింది. పొడుస్తున్న పొద్దు పాట తెలియని ప్రాంతమంటూ లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని చెబుతూ ప్రస్తావించిన బాణీలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఉద్యమంలో ఈ పాటకంటూ ఓ చరిత్ర ఉంది. ఆంధ్రా పాలకుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ.... అడవి తల్లి, గోదావరి, కృష్ణమ్మ, తెలంగాణ అమరవీరులను ప్రస్తావిస్తూ అద్భుతమైన సంగీతంతో రూపొందించారు. ఈ పాట గద్దర్ గొంతు నుంచి రావటంతో తెలంగాణ సాంస్కృతిక చరిత్రలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ పాటకు నంది అవార్డు కూడా వచ్చింది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా గద్దర్ తన గళాన్ని ఆపలేదు. ప్రజల తరపున తన స్వరాన్ని వినిపిస్తూనే వచ్చాడు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోని బయటికి వస్తారని అంతా భావించారు. కానీ ఊపిరితిత్తులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ‘గద్దర్’ అనే ప్రజాయుద్ధ నౌక ఆగస్టు 6న అస్తమించింది.

గదర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా’ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి….

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా

అదిగో ఆ కొండల నడుమ తొంగి చూచే ఎర్రని భగవంతుడు ఎవ్వడు?

సూర్యుడు

ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తోంది కాలం

అలా కాలంతో నడిసిన వాడే కదిలి పోతాడు

ఓ పొడుస్తున్న పొద్దు వందనం, వందనం

ఆ, పొడుస్తున్న భలే భలే భలే భలే భలే భలే

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే భలే భలే

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

కోట్లాది ప్రాణమా

ఓ భూతల్లి సూర్యుడిని ముద్దాడిన భూతల్లి

అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచింది

అమ్మా, నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తువి

భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు

చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు

మా భూములు మకేనని

భలే భలే భలే భలే భలే భలే

మా భూములు మకేనని మరల బడ్డ గానమ

తిరగ బడ్డ రాగమా

మరల బడ్డ గానమా

తిరగ బడ్డ రాగమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే భలే భలే

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

అమ్మా, గోదావరి నీ వొడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం

అమ్మా, కృష్ణమ్మా కిల కిల నవ్వే కృష్ణమ్మ, అమ్మా మీకు వందనం

గోదావరి అలలమీద కోటి కళల గానమా

కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా

మా నీళ్ళు

భలే భలే భలే భలే భలే భలే

మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా

కత్తుల కోలాటమా కన్నీటి గానమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే భలే భలే

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది

ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి

ఆ పువ్వులు అలా ఆడుతాయి

అదిగో పావురాల జంట మేమెప్పుడు విడిపోమంటాయి

విడిపోయిన భంధమా చెదిరిపోయిన స్నేహమా

యడ బాసిన గీతమా యదల నిండ గాయమా

పువ్వులు పుప్పడిలా

భలే భలే భలే భలే భలే భలే

పువ్వులు పుప్పడిలా పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా

పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

భలే భలే భలే భలే భలే భలే

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా

పోరు తెలంగాణమా

కోట్లాది ప్రాణమా

అదిగో రాజులు, దొరలు, వలస దొరలు, భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని సర్వస్వాన్ని చేరబట్టారు

రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు

రాజరికం కత్తి మీద నెత్తురుల గాయమా

దొరవారి గడులల్లో భలే భలే భలే

దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా

ఆంద్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా

మా పాలన

భలే భలే భలే భలే భలే భలే

మా పాలన మాకేనని మండుతున్న గోళమా

అమర వీరుల స్వప్నమా

మండుతున్న గళమా అమర వీరుల స్వప్నమా

అమర వీరుల స్వప్నమా

తదుపరి వ్యాసం