తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs To Congress: అప్పుడు బిఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వంతు…ఫిరాయింపులతో బెంబేలు, గేట్లు కాస్త తెరిచామంటున్న సిఎం రేవంత్

BRS to Congress: అప్పుడు బిఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వంతు…ఫిరాయింపులతో బెంబేలు, గేట్లు కాస్త తెరిచామంటున్న సిఎం రేవంత్

Sarath chandra.B HT Telugu

19 March 2024, 12:56 IST

    • BRS to Congress:తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ఎదురు లేదన్నట్టుగా సాగిన బిఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఎంత మంది మిగులుతారో కూడా తెలీని పరిస్థితి నెలకొంది.
సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి

BRS to Congress: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ గేట్లను కాస్త తెరిచినట్టు 100రోజుల పాలన పూర్తైన సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిఆర్‌ఎస్‌ BRS ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో Congress చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పరోక్షంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తాజా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, తొమ్మిదేళ్ల పాటు పాలన సాగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి తలకిందులైంది. ప్రాంతీయ పార్టీల్లో ఉండే బలాలు, బలహీనతలకు తాజా పరిణమాలు అద్దం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ స్వేచ్ఛగా మనలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు బిఆర్‌ఎస్‌ నిలదొక్కుకోవడానికి దారులు వెదుక్కోవాల్సిన పరిస్థితికి దిగజారింది.

100రోజుల పాలన పూర్తైన సందర్భంగా చేరికల కోసం గేట్లు తెరిచినట్టు రేవంత్ రెడ్డి Revanth Reddy చేసిన ప్రకటనతో ఎంతమంది బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఫిరాయిస్తారనే చర్చకు దారి తీసింది. బిఆర్‌ఎస్‌ చెందిన పలువురు ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు.

సునీతా లక్ష్మారెడ్డితో పాటుప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి వంటి వారు సిఎంను కలిశారు.తాము పార్టీ మారడం లేదని నియోజక వర్గాల అభివృద్ది కోసమే సిఎంను కలిశామని ప్రకటించినా ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు బిఆర్‌ఎస్‌లో నెలకొన్నాయి.

దానం నాగేందర్‌ కూడా కాంగ్రెస్‌ ఘర్‌ వాపసీకి సిద్ధమయ్యారు. దానంపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ నేతల్ని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సిద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది.

బిఆర్‌ఎస్‌పై ఎదురు దాడి...

కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్‌ నేతల చేరికలపై ఆ పార్టీ చేస్తోన్న ఆరోపణలకు కాంగ్రెస్ ధీటుగానే సమాధానం ఇస్తోంది. బిఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరు మిగలరని కాంగ్రెస్‌ నేతలు జోస్యం చెబుతున్నారు. పదేపదే తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీస్తున్నారు.

విపక్షాలను కట్టడి చేయడానికే తాము గేట్లు కాస్త తెరిచినట్టు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లలో కేసీఆర్‌ తీరుతో పోలిస్తే తాము చాలా నయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్టు కేసీఆర్ వ్యవహరించారని, ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తుంటే మొసలి కన్నీరు కరుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్నట్టు కేసీఆర్‌ వ్యవహరించారని, నైతికత గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను బలహీనం చేసేందుకు కేటీఆర్‌, హరీష్‌ రావు చేసిన ప్రయత్నాలు గుర్తు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి పదవి ఎలా ఇచ్చారని, సబితాకు మంత్రి పదవి ఇచ్చినపుడు టిఆర్‌ఎస్ ఏమి చేసిందో మర్చిపోయారా అని కాంగ్రెస్ నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. స్పీకర్ మధుసూదనాచారి, పోచారంలు అనర్హత పిటిషన్లపై ఎందుకు విచారణ చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యేకు 20ఏళ్ల క్రితం 5లక్షలు చెల్లించాల్సి ఉంటే, టిఆర్‌ఎస్‌లో చేర్చుకోడానికి వడ్డీలతో కలిపి రూ.26కోట్లు చెల్లించినట్టు గుర్తు చేస్తున్నారు.

పదేళ్ల పాలనలో ఎలాంటి సంకోచం లేకుండా రకరకాల ప్రలోభాలతో ఎమ్మెల్యేలను పార్టీలో కేసీఆర్ KCR చేర్చుకున్నారని, అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో విపక్షాలను ఏ మాత్రం ఖాతరు చేయలేదని ఇప్పుడు అధికారం చేజారగానే బిఆర్‌ఎస్‌ నుంచి నేతలు ఉడాయిస్తున్నారని చెబుతున్నారు.

తన పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నోరు తెరిచి ప్రశ్నించలేని స్థితికి కేసీఆర్ చేరుకున్నారని కేసీఆర్‌ తగిన గుణపాఠం చెబుతామంటున్నారు. 2014లో 23 మందిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, 2018లో 16మందిని చేర్చుకుంటే వారిలో కాంగ్రెస్‌ తరపున గెలిచిన 12మంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో ఫిరాయింపులు కూడా భాగం అన్నట్టు కేసీఆర్ వ్యవహరించారని ఇప్పుడు ఏ ముఖంతో తప్పు పడతారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

దానం నాగేందర్‌పై వేటుకు పట్టు...

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్‌ పట్టుబడుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని బిఆర్‌ఎస్ నేత వినోద్ డిమాండ్ చేశారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, బండారి లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు స్పీకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని కోరామని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమని చెప్పారు. బిఆర్‌ఎస్‌ ఫిర్యాదులపై కాంగ్రెస్‌ కూడా అలాగే స్పందిస్తోంది. స్పీకర్ విచక్షణాధికారాలను ప్రశ్నించలేరని గుర్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం